అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ తో తెలుగులో తెరకెక్కిన సినిమాలు ఇవే?

తెలుగులో అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ తో పదుల సంఖ్యలో సినిమాలు వచ్చాయి.ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు విజయం సాధించాయి.

 Brother And Sister Sentiment Movies In Tollywood Industry Details Here, Annavara-TeluguStop.com

ఈరోజు రాఖీ పూర్ణిమ కావడంతో పాటు అన్నాచెల్లెళ్ల బంధానికి ఈరోజు ప్రతీక కావడం గమనార్హం.సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమాల్లో పుట్టింటికి రా చెల్లి ఒకటి.

కోడి రామకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా అన్న పాత్రలో ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తే చెల్లెలి పాత్రలో మధుమిత నటించారు.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

కృష్ణవంశీ డైరెక్షన్ లో అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ తో తెరకెక్కిన రాఖీ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో అన్న పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించగా చెల్లి పాత్రలో మంజూష నటించారు.

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అబవ్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన అర్జున్ సినిమాలో అక్క పాత్రలో కీర్తిరెడ్డి నటించగా తమ్ముని పాత్రలో మహేష్ నటించారు.

బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా మహేష్ కెరీర్ లోని బెస్ట్ సినిమాలలో అర్జున్ ఒకటిగా నిలిచింది.

Telugu Annavaram, Brother Sister, Gorintaku, Puttintikira, Rakhi, Shivarama Raju

అన్నగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెల్లిగా సంధ్య కాంబినేషన్ లో తెరకెక్కిన అన్నవరం సినిమా బాక్సాఫీస్ వద్ద అబవ్ యావరేజ్ గా నిలిచింది.రాజశేఖర్ అన్నగా మీరాజాస్మిన్ చెల్లెలుగా నటించిన గోరింటాకు సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.అన్నా చెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Telugu Annavaram, Brother Sister, Gorintaku, Puttintikira, Rakhi, Shivarama Raju

చిరంజీవి హీరోగా అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన హిట్లర్ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.బాలయ్య హీరోగా అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ముద్దుల మావయ్య, యువరత్న రానా సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.జగపతిబాబు ప్రధాన పాత్రలో సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన శివరామరాజు ప్రేక్షకులను ఆకట్టుకుంది.సీనియర్ ఎన్టీఆర్, సావిత్రి కాంబినేషన్ లో రక్త సంబంధం పేరుతో అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో ఒక సినిమా తెరకెక్కింది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube