ఆ చెల్లెలు త‌న అన్న‌ను 9 ఏళ్లు చూడ‌లేదు. రాఖీ పండ‌క్కి చూసింది. తర్వాత ఏమైందో తెలుసా.?  

Brother And Sister Rakhi Relation-

అప్పుడు నా వ‌య‌స్సు 15 సంవ‌త్స‌రాలు.నా అన్న‌య్య‌కు 18 ఏళ్ల ఉంటాయి.అత‌ను అప్ప‌టికే ఆర్మీలో శిక్షణ పూర్తి చేసుకున్నాడు.విధులు నిర్వ‌హించేందుకు ఆర్మీతో క‌లిసేందుకు వెళ్తున్నాడు.డెహ్రాడూన్ రైల్వే స్టేష‌న్‌లో ఉన్నాం..

Brother And Sister Rakhi Relation--Brother And Sister Rakhi Relation-

నేను, అమ్మ‌, నాన్న అన్న‌య్య‌కు సెండ్ ఆఫ్ ఇవ్వ‌డానికి వెళ్లాం.అమ్మ చాలా ఏడుస్తూ ఉంది.కానీ నాకు మాత్రం చాలా ఆనందంగా అనిపించింది.

ఎందుకంటే నా అన్న దేశాన్ని, దేశ ప్ర‌జ‌ల‌ను ర‌క్షించే ఓ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన వృత్తిలో ప‌ని చేసేందుకు వెళ్తున్నాడు.అందుకే నాకు కొంత గ‌ర్వంగా అనిపించింది.అన్న‌య్య ఆ రోజున ఎక్కిన ట్రెయిన్ వైపు అలాగే చూస్తుండిపోయా.

అది వెళ్లేంత వ‌ర‌కు దాన్ని అలాగే చూశా.!

అప్ప‌టి నుంచి చాలా ఏళ్లు గ‌డిచాయి.చాలా రుతువులు, చాలా కాలాలు గ‌డిచిపోయాయి.

ఎన్నో పండుగలు, బ‌ర్త్‌డేలు వెళ్లిపోయాయి.అయినా అన్న‌య్య ఆర్మీలోనే ఉన్నాడు.తిరిగి రాలేదు..

ఏటా రాఖీ పండుగ రోజు అన్న‌య్య‌కు క‌ట్టే రాఖీ గుర్తుకొచ్చేది.ఇప్ప‌టికి అలాంటి రాఖీ పండుగ‌లు 9 వెళ్లిపోయాయి.ఆ పండుగ రోజున అన్న‌య్య రోజంతా గుర్తుకు వ‌స్తూనే ఉంటాడు.నిజానికి అత‌ను నాకు అన్న కాదు.

ఫ్రెండ్‌లా ఉండేవాడు.స‌మ‌స్య ఉంటే ప‌రిష్క‌రించేవాడు.ఎన్నో సంద‌ర్భాల్లో జాలీగా గ‌డిపిన రోజులు గుర్తుకు వ‌చ్చాయి.

అన్న‌తో నేను హ్యాపీగా ఉన్న మూమెంట్స్ నాకు ఇప్ప‌టికీ గుర్తుంటాయి.

ఉన్న‌ట్టుండి ఒక రోజున అర్థ‌రాత్రి 12.41 గంట‌ల‌కు నాకు ఫోన్ వ‌చ్చింది.కాల్ చేసింది అన్న‌య్యే.మ‌రో 15 నిమిషాల్లో నీ ద‌గ్గ‌రుంటా.! అని ఫోన్ పెట్టేశాడు.నా ఆనందానికి అవ‌ధులు లేవు.ఈ సారి రాఖీ పండ‌గ‌కి అన్న‌య్య వ‌చ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

నిజంగా ఈ పండుగ వ‌చ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.మ‌ళ్లీ అన్నను ఎప్పుడు క‌లుస్తానో అన్న బాధ కంటే ఇప్పుడు అన్న‌ను చూడ‌బోతున్నాన‌నే ఫీలింగ్ న‌న్ను అమిత‌మైన ఆనందానికి గురి చేసింది.నాకు తెలుసు, దేశ స‌రిహ‌ద్దుల్లో ప‌నిచేయ‌డ‌మంటే అంత ఆషామాషీ కాదు.

అందుకు అన్న‌య్య‌ను అభినందిస్తున్నా.నా కోసం వ‌చ్చినందుకు ఆనందిస్తున్నా.!”

— రాఖీ సంద‌ర్భంగా ఓ చెల్లెల్లు అన్న గురించి ప‌డిన తాప‌త్ర‌యానికి సంబంధించిన రియ‌ల్ స్టోరీ ఇది.!