విషాదం : చావు తప్పిందని సంతోషిస్తున్న సమయంలోనే మృత్యు ఒడిలోకి అన్నచెల్లి

శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేళ్లుల్లలో దాదాపు 350 మరణించినట్లుగా సమాచారం అందుతోంది.వేలాది మంది గాయాల పాలు అయ్యారు.

 Brother And Sister Into-TeluguStop.com

విహార యాత్రకు అంటూ వెళ్లిన వారు తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు.ఎంతో మంది గురించి మీడియాలో వస్తున్న వార్తలు కన్నీరు పెట్టిస్తుంది.

ఒక బిలియనీర్‌ పిల్లలు ముగ్గురు చనిపోవడంతో ఆయన నోట మాట కూడా రాకుండా అయ్యింది.అలాగే అన్న చెల్లి మరణంతో వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

బ్రిటన్‌కు చెందిన 20 ఏళ్ల డేనియల్‌ మరియు అతడి చెల్లి 15 ఏళ్ల అమీలీ శ్రీలంక బాంబు బ్లాస్ట్‌లో మృతి చెందారు.అయితే వీరి గురించి తల్లిదండ్రులు చెప్పిన ఒక విషయం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అవుతోంది.

వీరు ఆదివారం రాత్రి తిరిగి బ్రిటన్‌ వెళ్లాల్సి ఉంది.ఆ రోజు ఎయిర్‌ పోర్ట్‌కు వెళ్లే ముందు ఒక కాఫీ షాప్‌కు వెళ్లారు.

అక్కడ బాంబు పేళుడు సంభవించడంతో చిన్న గాయాలతో డేనియల్‌, అమీలీ మరియు వారి తల్లిదండ్రులు బయట పడ్డారు.బాంబు పేళ్లుల నేపథ్యంలో విమాన సర్వీస్‌లు నిలిపేయడం జరిగింది.

దాంతో తిరిగి వారు హోటల్‌కు వెళ్లారు.హోటల్‌కు వెళ్లి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే మరో బాంబ్‌ బ్లాస్‌ హోటల్‌లో జరిగింది.

ఈసారి ఆ అన్న చెల్లి తప్పించుకోలేక పోయారు.వారిద్దరు కూడా మృతి చెందారు.తల్లిదండ్రులకు కడుపు శోకం మిగిల్చి వారిద్దరు తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయారు.ఇద్దరు పిల్లలు మరణించడంతో ఆ తల్లిదండ్రుల వేదన చెప్పలేకుండా ఉంది.అత్యంత దారుణంగా ఉన్న ఇలాంటి పరిస్థితులు, సోకాలతో శ్రీలంక మొత్తం కూడా దద్దరిల్లుతోంది.ఎంతో మంది జీవితాల్లో బాంబు పేళుడు శోకంను నింపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube