రెండు నిమిషాల్లో రెడీ అయ్యే మ్యాగీ తో సింక్ రిపేర్...వీడియో వైరల్  

Broken Sink With A Ramen Noodles-telugu Viral News,మ్యాగీ

ఉన్నట్టుండి మీకు ఆకలి వేస్తె రెండు నిమిషాల్లో రెడీ అయ్యే మ్యాగీ కోసం అందరూ చూస్తూఉంటారు. పిల్లలకు కూడా ఈ మ్యాగీ అంటే పిచ్చి అని చెప్పాలి. దీనితో అమ్మ ఆకలి వేస్తుంది మ్యాగీ చెయ్యవా ప్లీజ్ అంటూ పిల్లలు అడుగుతూ ఉంటారు..

రెండు నిమిషాల్లో రెడీ అయ్యే మ్యాగీ తో సింక్ రిపేర్...వీడియో వైరల్-Broken Sink With A Ramen Noodles

అయితే ఇలాంటి మ్యాగీ తో సింకులు రిపేర్ చేస్తారు అని ఎవరైనా ఊహించగలరా.

నిజంగా అదే జరిగింది సింక్ పగిలిపోవడం తో రిపేర్ చేయడానికి నూడిల్స్ ఉపయోగించారు. ఇప్పుడు దీనికి సంబందించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. పగిలిపోయిన సింక్ లో నూడిల్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి నూడిల్స్ దానిలో వేసి చకా చకా రిపేర్ చేసేశాడు.

అంతా సాఫ్ చేసిన తరువాత చివరిగా వైట్ స్ప్రే కొట్టి అచ్చం కొత్త దానిలో ఆ సింక్ కు రూపాన్ని తీసుకువచ్చాడు..

అయితే ఈ తతంగం మొత్తానికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. దీనిని చూసి చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలా కూడా సింక్ ను రిపేర్ చేయొచ్చా అంటూ అందరూ విడ్డూరంగా చూస్తున్నారు.

నూడిల్స్ తో సింకు లు రిపేర్ చెయ్యడం ఏంటో,కూల్ డ్రింక్స్ తో టాయ్ లెట్ లు క్లీన్ చెయ్యడం ఏంటో ఇవన్నీ చూస్తుంటే నిజంగా మనుషులు ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నారా అన్న జాలి కలుగుతుంది కొందరు నెటిజన్లకి.