రెండు నిమిషాల్లో రెడీ అయ్యే మ్యాగీ తో సింక్ రిపేర్...వీడియో వైరల్

ఉన్నట్టుండి మీకు ఆకలి వేస్తె రెండు నిమిషాల్లో రెడీ అయ్యే మ్యాగీ కోసం అందరూ చూస్తూఉంటారు.పిల్లలకు కూడా ఈ మ్యాగీ అంటే పిచ్చి అని చెప్పాలి.

 Broken Sink With A Ramen Noodles-TeluguStop.com

దీనితో అమ్మ ఆకలి వేస్తుంది మ్యాగీ చెయ్యవా ప్లీజ్ అంటూ పిల్లలు అడుగుతూ ఉంటారు.అయితే ఇలాంటి మ్యాగీ తో సింకులు రిపేర్ చేస్తారు అని ఎవరైనా ఊహించగలరా.

రెండు నిమిషాల్లో రెడీ అయ్యే మ

నిజంగా అదే జరిగింది సింక్ పగిలిపోవడం తో రిపేర్ చేయడానికి నూడిల్స్ ఉపయోగించారు.ఇప్పుడు దీనికి సంబందించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.పగిలిపోయిన సింక్ లో నూడిల్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి నూడిల్స్ దానిలో వేసి చకా చకా రిపేర్ చేసేశాడు.అంతా సాఫ్ చేసిన తరువాత చివరిగా వైట్ స్ప్రే కొట్టి అచ్చం కొత్త దానిలో ఆ సింక్ కు రూపాన్ని తీసుకువచ్చాడు.

రెండు నిమిషాల్లో రెడీ అయ్యే మ

అయితే ఈ తతంగం మొత్తానికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.దీనిని చూసి చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఇలా కూడా సింక్ ను రిపేర్ చేయొచ్చా అంటూ అందరూ విడ్డూరంగా చూస్తున్నారు.నూడిల్స్ తో సింకు లు రిపేర్ చెయ్యడం ఏంటో,కూల్ డ్రింక్స్ తో టాయ్ లెట్ లు క్లీన్ చెయ్యడం ఏంటో ఇవన్నీ చూస్తుంటే నిజంగా మనుషులు ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నారా అన్న జాలి కలుగుతుంది కొందరు నెటిజన్లకి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube