ఆకలిని పెంచే ఒకేఒక్క పువ్వు  

Broccoli Benifits In Food Habits-

ఉదయాన్నే చలా మంది టిఫిన్ చేయకపోయినా సరే మధ్యాహ్నం భోజనం టైం కి ఆకలి వేయదు.కడుపులో మందంగా ఉన్నట్టుగా ఉంటుంది.ఆకలి వేస్తున్నా ఏమీ తినాలని అనిపించదు.ఫాస్ట్ ఫుడ్ తినీ వాళ్ళలో.రాత్రిళ్ళు లేటుగా పడుకునే వాళ్ళలో ఈ సమస్య ఉంటుంది.అంతేకాదు ఎక్కువగా మసాలాలు తినేవాళ్ళు కూడా ఇటువంటి సమస్యని ఎదుర్కుంటారు.అయితే ఇటువంటి సమస్యకి ఒక చక్కని పరిష్కారం ఉంది. ‘బ్రకోలీ’.అనేది క్యాబేజీ కుటుంబానికి చెందిన ఒకరకమైన ఆకుకూర పేరు.బక్రోలి ఇటలీకి చెందిన ఒక పుష్పగుచ్చపు పైభాగం.ఆకుపచ్చని వర్ణంలో ఉండే బ్రకోలీని పచ్చిగాను, ఉడకబెట్టి కూడా తింటారు.వీటిలో ఉండే గ్లుసినోలేట్స్ లక్షణం కళ్లకు మేలు చేస్తుంది.గ్లకోమా వ్యాధి రాకుండా అడ్డుకుంటుంది.‘బ్రకోలీ’లో విటమిన్స్ అధికంగా ఉంటాయి.వీటిలో సి, ఎ, కెలు అధిక మోతాదులో ఉంటాయి.వంద గ్రాముల బ్రకోలిలో ఉండే విటమిన్ సి, ఒక కమలాపండు రసంలో ఉన్న సి విటమిన్ తో సమానం.జీర్ణాశయం ని సుద్దిచేయడంలో ఇది చాలకా బాగా ఉపయోగపడుతుంది.బ్రకోలీలోని ఫ్లవనాయిడ్స్, ఆకలిని పెంచడంలో దీనికి సాటి మరొకటిలేదు.కరోటినాయిడ్స్ జీర్ణాశయ గోడలు, రక్తనాళాల లోపలి పొరలను కాపాడతాయి.ఈ ‘బ్రకోలీ పంట అమెరికాలో మరియు చైనా లో అధికంగా పండిస్తారు.

Broccoli Benifits In Food Habits---

రెండవ స్థానంలో ఇండియా ఉంది.అంతేకాదు ఇది గుండెకి కూడా చాలా మంచిది అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు.