అన్నా, దీపు అక్కతో మాట్లాడకుండా ఉండగలగుతున్నావా.. షన్ను ఫ్యాన్స్!

Bro Can You Stay Without Talk To Deepu Shanmukh Fans

బిగ్ బాస్ సీజన్ 5 ఇటీవలే ముగిసిన సంగతి అందరికి తెలిసిందే.ఇక ఈ షో అందరికీ మంచి చేస్తుందని తెలుసు.

 Bro Can You Stay Without Talk To Deepu Shanmukh Fans-TeluguStop.com

ఒక హోదాను అందిస్తుందని తెలుసు.కానీ ఈ సీజన్ 5 మాత్రం ఒక జంటని విడదీసింది.

ఎన్నో ఏళ్లుగా ప్రేమ లో ఉన్న ఆ జంటను బిగ్ బాస్ పొట్టనపెట్టుకుంది.ఈపాటికే మీకు ఈ విషయం అర్థం కావచ్చు.

 Bro Can You Stay Without Talk To Deepu Shanmukh Fans-అన్నా , దీపు అక్కతో మాట్లాడకుండా ఉండగలగుతున్నావా.. షన్ను ఫ్యాన్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో పాల్గొన్న యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ గురించి అందరికీ తెలిసిందే.

పలు షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ ద్వారా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.నిజానికి ఒక స్టార్ హీరోకి ఉన్నంత క్రేజ్ ను సంపాదించుకున్నాడు షణ్ముఖ్.

కానీ ఆ క్రేజ్ మొత్తం బిగ్ బాస్ తర్వాత లేదనే చెప్పాలి.ఎందుకంటే ఆయన మరో కంటెస్టెంట్ సిరితో ఎంతలా రచ్చ చేశాడో చూశాం.

నిజానికి వారిద్దరూ వయసులో ఉన్నారు కాబట్టి అలా ప్రవర్తించారు అనుకోవచ్చు.కానీ ఆ ఇద్దరు మరో ఇద్దరితో రిలేషన్ షిప్ లో ఉన్నారు.

ఇక సిరి మాత్రం తన బాయ్ ఫ్రెండ్ తో నిశ్చితార్థం కూడా జరుపుకుంది.షణ్ముఖ్ మరో యూట్యూబ్ స్టార్ దీప్తి సునయన తో లవ్ లో ఉన్నాడు.

ఈ విషయాన్ని దీప్తి సునైనా ఈ షోలోనే చెప్పుకుంది.ఎంతో మంది ముందు షన్నును ప్రపోజ్ చేసింది.

Telugu Bigg Boss, Break, Deepthi, Deepthi Sunaina, Fans, Shanmukhdeepthi, Shanu, Siri Hanmanthu-Movie

షన్ను కూడా దీప్తి సునయన ప్రేమిస్తున్నాడు.వీరు బిగ్ బాస్ షో ముందు కలిసి షార్ట్ ఫిలిమ్స్ చేశారు.కవర్ సాంగ్స్ చేశారు.పలు బుల్లితెర షోలలో పాల్గొన్నారు.అంతేకాదండోయ్ ఇద్దరు కలిసి సేమ్ టాటూలు కూడా వేయించుకున్నారు.దీంతో గతంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తుందని చాలామంది అనుకున్నారు.

కానీ తాము ఫ్రెండ్స్ అని కొన్ని రోజుల వరకు అసలు విషయాన్ని బయట పెట్టకుండా తిరిగారు.

Telugu Bigg Boss, Break, Deepthi, Deepthi Sunaina, Fans, Shanmukhdeepthi, Shanu, Siri Hanmanthu-Movie

కానీ బిగ్ బాస్ హౌస్ లో దీప్తి సునయన ప్రపోజ్ చేయడంతో వీరి మధ్య నిజంగానే లవ్ నడుస్తుందని క్లారిటీ వచ్చింది.పైగా అతడి బర్త్ డే  కూడా స్పెషల్ సర్ ప్రైజ్ చేసింది దీప్తి.కానీ షన్ను సిరితో ఉండే విధానం ప్రేక్షకులకు నచ్చకపోవడంతో చాలా నెగిటివిటీ ని సంపాదించుకున్నాడు.

దీప్తి సునయన కూడా తమ మధ్య బాండింగ్ అస్సలు నచ్చలేదు.దీంతో అతడు షో నుండి బయటకు రాగానే వెంటనే సోషల్ వేదికగా అతడికి బ్రేక్ అప్ చెబుతున్నానని చెప్పేసింది.

Telugu Bigg Boss, Break, Deepthi, Deepthi Sunaina, Fans, Shanmukhdeepthi, Shanu, Siri Hanmanthu-Movie

దీంతో తమ అభిమానులు చాలామంది తట్టుకోలేకపోయారు.సోషల్ మీడియాలో తెగ ప్రశ్నలు వేస్తున్నారు.కొందరు బాగా ధైర్యం ఇస్తున్నారు.ఇక ఎప్పటిలాగే వీరిద్దరి సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటున్నారు.కానీ వాళ్ళల్లో మాత్రం ఆనందం కనిపించడం లేదు.ఇదిలా ఉంటే తాజాగా షన్ను తన సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు షేర్ చేశాడు.

అందులో అతడి ఫాన్స్ బాగా కామెంట్లు పెడుతున్నారు.ఒక అభిమాని మాత్రం.

అన్న దీపు అక్కతో మాట్లాడకుండా ఉండగలుగుతున్నావా అని ప్రశ్నించారు.ప్రస్తుతం ఆ కామెంట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

#Deepthi Sunaina #Break #ShanmukhDeepthi #Shanu #Bigg Boss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube