యూకే: పదో అంతస్తు నుంచి ఆరేళ్ల బాలుడిని విసిరేసిన సైకో

లండన్‌లోని ప్రఖ్యాత టేడ్ మోడరన్ ఆర్ట్ గ్యాలరీ 10వ అంతస్తు నుంచి ఓ యువకుడు ఆరేళ్ల ఫ్రెంచ్ బాలుడిని కిందకు విసిరేసిన ఘటన సంచలనం కలిగించింది.అంతు ఎత్తు నుంచి కింద పడటంతో చిన్నారి వెన్నెముక, కాళ్లు, చేయి విరిగింది.18 ఏళ్ల బ్రేవరీ డిసెంబర్ 6న లండన్ సెంట్రల్ క్రిమినల్ కోర్టులో జరిగిన విచారణలో హత్యాయత్నానికి పాల్పడినట్లు అంగీకరించాడు.ఇందుకు సంబంధించి తీర్పును ఈ నెలాఖరుకు వాయిదా వేసింది.

 British Teenager Who Threw Boy From Tate Modern Art Gallery London-TeluguStop.com
Telugu Bravary, Britishteenager, Gofandami, Londonmodern-Telugu NRI

కాగా తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి కోసం అతని తండ్రి గోఫండ్‌మీ పేజీలో పోస్ట్ చేశాడు.తమ బాబు శరీరంలో ప్రస్తుతం కొంత కదలిక వచ్చిందని, కొద్దికొద్దిగా మాట్లాడుతున్నాడని ఆయన చెప్పాడు.కానీ చిన్నారి ఇంకా చాలా బాధలో ఉన్నాడని.కోలుకోవడానికి ఎంతో సమయం పడుతుందని అభిప్రాయపడ్డాడు.

Telugu Bravary, Britishteenager, Gofandami, Londonmodern-Telugu NRI

కోర్టులో విచారణ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ.చిన్నారి అదృష్టవశాత్తూ ఐదవ అంతస్తు పైకప్పుపై పడ్డట్టు తెలిపారు.కాగా తన క్లయింట్‌కు ఆటిస్టిక్ స్పక్ట్రం డిజార్డర్, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నాయని బ్రేవరీ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు.అయితే చిన్నారిని కిందకు విసిరే సమయంలో అతను ప్రజలను బాధపెట్టాలని లేదా చంపాలని బిగ్గరగా కేకలు పెట్టినట్లుగా కోర్టు దృష్టికి వచ్చింది.

దీనిపై స్పందించిన న్యాయస్థానం బ్రేవరీ తన మానసిక ఆరోగ్య సమస్యను నిరూపించుకోవాలని ఆదేశించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube