దక్షిణ ధృవంపై దండయాత్ర .. చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన భారత సంతతి బ్రిటీష్ మహిళ

నేటీకాలంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో పోటీపడుతున్నారు.ఒక్క ఉద్యోగ, వ్యాపారాలలోనే కాకుండా సాహస యాత్రలలో కూడా మేము సైతం అంటున్నారు.

 British Sikh Female Army Officer Harpreet Chandi Sets Off For South Pole Adventu-TeluguStop.com

సాహస యాత్రలపై మహిళలకు ప్రతియేటా ఆసక్తి పెరుగుతున్నట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.మనదేశంలో కూడా సాహస యాత్రలు చేస్తున్న మహిళల సంఖ్య పెరుగుతుందని ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన సిక్కు మహిళ దక్షిణ ధ్రువ యాత్రకు బయల్దేరారు.

32 ఏళ్ల హర్‌ప్రీత్ చాందీ బ్రిటీష్ సైన్యంలో కెప్టెన్‌గా పనిచేస్తున్నారు.దక్షిణ ధృవాన్ని ఎవరి సాయం లేకుండా ఒంటరిగా చుట్టిరావాలని.తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత సంతతి మహిళగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ మేరకు ఆదివారం హర్‌ప్రీత్ చిలీ బయల్దేరి వెళ్లారు. దక్షిణ ధృవంపై మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంటాయి.

ఇలాంటి ప్రతికూల పరిస్ధితుల్లో తన కిట్‌ను లాక్కుంటూ 700 మైళ్లు వెళ్లాల్సి వుంటుంది.ఈ మేరకు తన బ్లాగ్‌‌లో చాందీ వ్రాసుకొచ్చారు.

ఈ ప్రయాణం పూర్తవ్వడానికి 45-47 రోజులు పడుతుందని హర్‌ప్రీత్ పేర్కొన్నారు.ఈ సమయంలో ప్రజలు తన రోజువారీ వాయిస్ బ్లాగ్‌లను ఫాలో అయ్యేందుకు వీలుగా ప్రత్యక్ష ట్రాకింగ్ మ్యాప్‌లను అప్‌లోడ్ చేయాలని ఆమె యోచిస్తున్నారు.

Telugu Britishsikh, British, Harpreet Chandy, Masters Degree, Queen Marys-Telugu

ప్రస్తుతం హర్‌ప్రీత్ ఇంగ్లాండ్ వాయువ్య ప్రాంతంలో ఉన్న మెడికల్ రెజిమెంట్‌లో సైన్యంలోని వైద్యులకు క్లినికల్ ట్రైనింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.ఆమె లండన్‌లోని క్వీన్ మేరీస్ యూనివర్సిటీలో పార్ట్‌టైమ్‌లో స్పోర్ట్స్ అండ్ ఎక్సర్‌సైజ్ మెడిసిన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.అలాగే ధృవ ప్రాంతంలో శిక్షణ కోసం హర్‌ప్రీత్ అంటార్కిటికాలో భారీ స్లెడ్జ్‌కు బదులుగా రెండు పెద్ద టైర్లను ఉపయోగిస్తున్నారు.అంటార్కిటికా భూమిపై అత్యంత శీతలమైన, ఎత్తైన, పొడిగా, గాలులతో వుండే ఖండమని ఆమె చెప్పారు.

అక్కడ శాశ్వతంగా ఎవరూ నివసించరని.తొలుత తన ప్రణాళికను ప్రారంభించినప్పుడు ఆ ఖండం గురించి పెద్దగా ఏమి తెలియదని అదే తనను అక్కడికి వెళ్లడానికి ప్రేరేపించిందని హర్‌ప్రీత్ తెలిపారు.

ఈ ఖండంలో ఒంటరిగా, ఎవరి మద్ధతు లేకుండా ట్రెక్‌ను పూర్తి చేసిన సాహస మహిళలు కొందరే వున్నారని .అందువల్ల కొత్త చరిత్ర సృష్టించాల్సిన సమయం ఇది అని ఆమె అన్నారు.తాను పూర్తి చేసిన ప్రతి శిక్షణా తనను లక్ష్యానికి చేరువ చేస్తుందని.ముఖ్యంగా గ్రీన్‌లాండ్, నార్వేలలో తీసుకున్న ట్రైనింగ్ ఎంతగానో సహాయపడిందని హర్‌ప్రీత్ చెప్పారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube