భారత్‌ దెబ్బకి దిగొచ్చిన బ్రిటీష్‌ సెక్యూరిటీ!

అవును, భారత్‌ దెబ్బకు యూకే( UK ) అధికారులు అబ్బా అన్నారు.పరిస్థితి అర్ధం చేసుకున్న అధికారులు ఎట్టకేలకు దిగి వచ్చారు.

 British Security That Came Down To India's Blow, Indian, British, Security, Poli-TeluguStop.com

లండన్‌లోని భారత హైకమిషన్‌ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని అక్కడ నియమించడం జరిగింది.

ఖలీస్తానీ సానుభూతిపరులు కూడా కొందరు అక్కడికి చేరుకోవడం జరిగింది.నిన్న ఢిల్లీలో( Delhi ) జరిగిన పరిణామాల కారణంగా యూకే అధికారులు ఈ చర్యలకు పూనుకోవడం గమనార్హం.

ఇక ఆదివారం లండన్‌లోని భారత హైకమిషన్‌ వద్ద ఖలీస్తానీ సానుభూతిపరులు చేసిన రచ్చ గురించి తెలిసిందే.

ఈ విషయంపై భారత్ తీవ్ర అసంతృప్తి వెల్లడించింది.ఎందుకంటే అదే సమయంలో అక్కడ స్థానిక భద్రతా సిబ్బంది లేకపోవడం పట్ల భారత్‌ అసహనాన్ని వ్యక్తం చేసింది.అయితే భారత హైకమిషన్‌( Indian High Commission ) వద్ద సెక్యూరిటీ పర్యవేక్షణతో తమకు సంబంధం లేదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించగా దీనికి కౌంటర్‌గా బుధవారం నాడు.

ఢిల్లీలోని యూకే హైకమిషన్‌ ఎదుట ట్రాఫిక్‌ బారికేడ్లు తొలగించడంతో పాటు భద్రత కోసం కేటాయించిన స్థానిక పోలీసు సిబ్బందిని గణనీయంగా తగ్గించింది కేంద్రం.ఈ పరిణామంతో యూకే వెంటనే సర్దుకోవడం మొదలుపెట్టింది.

ఈ క్రమంలో లండన్‌ భారత హైకమిషన్‌ వద్ద భారీ భద్రతను పెంచింది.సమీప వీధుల్లో కూడా గస్తీని నిర్వహించింది.దాంతో ఆ భద్రతా సిబ్బందిని చూసి నిరసనకారులు.వెనక్కి తగ్గడం గమనార్హం.ఈ ఆదివారం.ఖలీస్తానీ( Khalistani ) సానుభూతిపరులు భారత హైకమిషన్‌పై దాడికి యత్నించడం, భారత త్రివర్ణ పతాకాన్ని అవమానించేందుకు ప్రయత్నించడం జరిగింది.

కాగా ఈ ఘటనను భారత్‌ మాత్రం తీవ్రంగా పరిగణించింది.ఈ మేరకు అక్కడ బ్రిటీష్‌ సెక్యూరిటీ లేకపోవడం పట్ల దాడి జరిగిందంటూ భారత్ ఒక కారణంగా పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube