అయ్యో దేవుడా.. జీతం సరిపోవట్లేదని ప్రధాని పదవికే రాజీనామా...?!

ప్రధాని అవ్వడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు.రాజకీయ కుతంత్రాలను తెలిసి, ప్రత్యర్థుల వ్యూహాలను దాటుకొని ఎంతో కష్టపడితే కాని ప్రధాని కాలేము.

 British Prime Minister Boris Johnson Plans To Resign, British Prime Minister, Bo-TeluguStop.com

అలాంటిది మరీ దారుణంగా ప్రధాని పోస్టుకు వచ్చే జీతం సరిపోవటం లేదని ప్రధాని పదవిని వదులుకుంటారా…? అయితే ప్రధాని పదవికి ఆ దేశం వారు ఇచ్చే జీతం సరిపోవట్లేదట.బ్రిటన్ దేశ ప్రధాని జాన్సన్ ను ఎన్నుకున్న తర్వాత ఆయనకు చాలా ఆర్ధిక ఇబ్బందులు పెరిగాయట.

చివరికి తన సొంత ఇంటి ఖర్చులకు కూడా సరిపోవడం లేదని ఆయన తెగ బాధపడిపోతూ ఉన్నారట.

తాను ప్రధాని కాకముందు ఆయనికి 2.75 లక్షల పౌండ్లు జీతం వచ్చేదట.అంతేకాకుండా, బయట ఎక్కడైనా స్పీచ్ లు ఇవ్వడం ద్వారా మరో 1.6 లక్షల పౌండ్లు చేతికొచ్చేవట.అయితే ప్రస్తుతం పరిస్థితి చూస్తే తాను ప్రధానిగా అయిన తర్వాత కేవలం 1.5 లక్షల పౌండ్లు మాత్రమే సంవత్సరానికి జీతం పొందుతున్నట్లు తెలిపారు.దీన్ని బట్టి చూస్తే తాను బయట ఎక్కడైనా స్పీచ్ లు ఇస్తే వచ్చే సొమ్ము మాత్రమే.

ఈ రేంజ్ లో జీతం వచ్చిన కానీ తన జీతం పైసలు కూడా సరిపొవట్లేదని ఆయన వాపోతున్నారు.తనకు జీవితం చాలాకుండా తాను ప్రజలకు సేవ ఎలా చేస్తా అని తెగ బాధపడిపోతున్నారు.

ఇప్పుడు ఆ దేశ మీడియా అంతా ఇదే విషయాన్ని తెగ ప్రచారం చేస్తోంది.

అయితే ఇక అసలు విషయంలోకి వెళితే.

బ్రిటన్ ప్రధానికి 6 మంది పిల్లలు.అందులో ప్రస్తుతం ఆయన రెండో వివాహం చేసుకొని ఉన్నారు.

మొదటి భార్యకు ప్రతినెల భరణం కట్టాల్సి ఉంది.ఇలా ఈ వయసులో కూడా ఆయన ప్రధాని గా ఉంటున్న కానీ ఎన్నో కష్టాలను మోస్తున్నారు.

ఏ మనిషికైనా పెళ్ళాం పిల్లల బరువులు ఉండనే ఉంటాయి కదా.కాబట్టి తనకు వచ్చే డబ్బులతో మాజీ భార్యకు భరణం ఎలా కట్టాలి.? ప్రస్తుతం పిల్లలు అందరిని ఎలా చూసుకోవాలి.? తనపై ఖర్చులు ఎలా అవుతుంటాయి.? ఇలా అన్ని లెక్కలు వేస్తే.ప్రధాని రాజీనామా చేసి పాత ఉద్యోగం చేసుకుంటా అంటున్నారట ప్రధాని.

దీంతో ప్రస్తుతం ఈ ప్రధాని జీతం చాలకపోతే ఏవిధంగా ప్రధాని బాధ్యతలు చేస్తారని ప్రజలు విడ్డూరంగా మాట్లాడుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube