బ్రిటన్ వాణిజ్య మంత్రి అలోక్ శర్మ గురించి ఐదు ముక్కల్లో...  

In Five Points About British Trade Minister Alok Sharma ... - Telugu Alok Sharma, British Trade Minister Alok Sharma, Nri, Telugu Nri News Updates, అలోక్ శర్మ

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌ కేబినెట్‌లో ముగ్గురు భారత సంతతి ఎంపీలు చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.గురువారం జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ బ్రిటన్ ఆర్ధికమంత్రిగా, అలోక్ శర్మ వాణిజ్య మంత్రిగా నియమితులైన సంగతి తెలిసిందే.

In Five Points About British Trade Minister Alok Sharma ... - Telugu Alok Sharma, British Trade Minister Alok Sharma, Nri, Telugu Nri News Updates, అలోక్ శర్మ-Telugu NRI-Telugu Tollywood Photo Image

వీరిలో రిషి సునక్ పేరు ప్రపంచం మొత్తం మారుమోగగా.అలోక్ శర్మ‌ కాస్త వెనుకబడ్డారు.

ప్రధాని జాన్సన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్న శర్మ గతంలో పలు పదవులు నిర్వహించారు.

ఆయన గురించి ఐదు ముక్కల్లో చూస్తే:

1.52 ఏళ్ల అలోక్ శర్మ భారత్‌లో జన్మించారు.ఆయనకు ఐదేళ్ల వయసున్నప్పుడే వీరి కుటుంబం ఇంగ్లాండ్‌కు వలస వెళ్లింది.
2.బ్యాంకింగ్ రంగంలో అపార అనుభవం ఉన్న అలోక్ శర్మ, 2010లో రీడింగ్ వెస్ట్ నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు.ఈ నియోజకవర్గం తొలి నుంచి కన్జర్వేటివ్‌లకు కంచుకోటగా ఉంది.
3.రాజకీయ ప్రస్థానంలో పలు పదవులు నిర్వర్తించిన ఆయన 2016లో ప్రధాన మంత్రి మౌలిక సదుపాయాల ప్రతినిధిగా భారత్‌‌లో విధులు నిర్వర్తించారు.ఆ తర్వాతి ఏడాది గృహ నిర్మాణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
4.2019లో ఇంటర్నేషనల్ ఎయిడ్‌ మంత్రిగా పనిచేశారు.2016లో హౌసింగ్ మినిస్టర్‌గా ఉన్న సమయంలో లండన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించి 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటన అలోక్ శర్మను తీవ్రంగా కలచివేసింది.దీని గురించి స్పందిస్తూ.ఆయన పార్లమెంట్‌లోనే కన్నీటి పర్యంతమయ్యారు.
5.అలోక్ శర్మకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

తాజా వార్తలు

In Five Points About British Trade Minister Alok Sharma ...-british Trade Minister Alok Sharma,nri,telugu Nri News Updates,అలోక్ శర్మ Related....