వైరల్ వీడియో: ఇదేమి వీడియోరా బాబు.. చూస్తేనే పై ప్రాణాలు పైనే పోతున్నాయిగా..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో గుండె దడ పుట్టించే వీడియో ఒకటి బాగా వైరల్ గా మారింది.ఆ వీడియో చూస్తున్నంత సేపు మీ రోమాలు నిక్కపొడుచుకోవడం గ్యారంటీ.అంత గొప్ప సాహసం చేసాడు ఒక వ్యక్తి.6,522 మీటర్ల ఎత్తు అంటే ఒకసారి ఊహించుకోండి.అంత ఎత్తులో సహజంగానే ఆక్సిజన్ అందడం అంటే కష్టం అనే చెప్పాలి.మరి అలాంటిది ఒక వ్యక్తి భూమి నుంచి 6, 522 మీటర్ల ఎత్తు 21,400 అడుగుల ఎత్తులో ఉండి ఆకాశంలో ఎగిరే రెండు హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లను కలిపే మెటల్‌ ప్లాంక్‌ పై నడవడం అంటే మాములు విషయమా చెప్పండి.

 British Man Mike Hovard Creates Guinness World Record Walk Over 6522 Meters Heig-TeluguStop.com

ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, లేదంటే కాలు స్లిప్ అయినాగానీ ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం.అసలు అంత సాహసం చేయాలంటేనే ఎన్నో గట్స్ ఉండాలి.

ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఆ వ్యక్తి కళ్ళు తెరిచి చూస్తూ హాట్ బెలూన్స్ మధ్య ప్లాంక్ దాటలేదండోయ్.చూడకూండా కళ్ళకు గంతలు కట్టుకుని మరి నడిచాడు.

దాంతో అతన్ని సాహసాన్ని గుర్తించి గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్ లో అతని సాహసం నమోదు చేసారు.అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు.17 సంవత్సరాల నాటి క్రితం వీడియో అన్నమాట.గిన్నిస్ బుక్ లో రికార్డ్ సాధించిన ఈ సాహసోప్రేరితమైన వీడియోను మళ్ళీ గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్టు చేయగా అది కాస్త వైరల్ అయింది.

ఇంతకీ ఈ రికార్డ్ సాధించిన వ్యక్తి ఎవరూ అంటే.బ్రిటన్‌కు చెందిన మైక్ హోవార్డ్ అనే వ్యక్తి ఈ రికార్డ్ ను సృష్టించాడు.2004 సెప్టెంబర్ 1న తీసిన ఈ వీడియో అప్పట్లోనే ఒక సంచలనం క్రియేట్ చేసింది.6,522 మీటర్ల ఎత్తులో గల రెండు హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ లను కలిపే మెటల్‌ ప్లాంక్‌ పై కేవలం తీగల సాయంతో కళ్లకు గంతలు కట్టుకుని మైక్ నడుస్తూన్నప్పుడు ప్రతి ఒక్కరి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతాయి అనడంలో అతిశయోక్తి లేదు.మైక్ వేసే అడుగులు ఏ మాత్రం అటు ఇటు అయిన కిందబడిపోయే ప్రమాదం ఉంది.కానీ మైక్ మాత్రం అసలు భయపడకుండా ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.

వీడియో పాతదే అయిన నెటిజన్లు మాత్రం మైక్ హోవార్డ్‌ గట్స్ ను తెగ మెచ్చుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube