వావ్.. ఒక్క టమాటా చెట్టుకు 839 పండ్లు..ఎలా సాధ్యం అబ్బా!

వ్యవసాయం చేయడం అంటే కొంతమందికి ఇష్టం అనే చెప్పాలి.వ్యవసాయంలో కూడా ఆధునికతను జోడించి అధిక పంట వచ్చేలా చేస్తూ ఉంటారు మరికొంత మంది.

 British Man Makes World Record By Growing Over 839 Cherry Tomatoes On Single Stem-TeluguStop.com

తోటలో పనిచేస్తూ వాటిని కన్నా బిడ్డలలాగా సాకుతూ అవి ఎప్పుడు ఎదిగి పంటను అందిస్తాయా అని ఇంకొంత మంది ఎదురు చూస్తుంటారు.కొంతమందికి కొన్ని వాటిపై ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది.

అలాగే ఒక వ్యక్తికి మొక్కలు పెంచాలని వాటిని వినూత్న ప్రయోగాలతో అధిక దిగుబడి తేవాలని ఆసక్తి.అందుకే అతడి పంట దిగుబడిపై వినూత్న ప్రయోగాలు చేస్తూ ఉంటాడు.

 British Man Makes World Record By Growing Over 839 Cherry Tomatoes On Single Stem-వావ్.. ఒక్క టమాటా చెట్టుకు 839 పండ్లు..ఎలా సాధ్యం అబ్బా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనితో అతడికి గుర్తింపు కూడా లభించింది.అతడు ఒక టమాటా చెట్టు కొమ్మకు కొత్త పద్దతులతో ఏకంగా 839 టమాటాలు కాసేలా చేసాడు.

ఈ ఘటన ఇంగ్లాండ్ లో జరిగింది.

అతడి పేరు డగ్లస్ స్మిత్.ఈయనకు ఆధునిక పద్దతిలో వ్యవసాయం చేస్తూ అధిక పంట దిగుబడి చేయాలనీ ఒక కల.దీంతో అతడు ఇనూత్న పద్దతులను ఉపయోగించి ఒక టమాటా చెట్టు కొమ్మకు ఏకంగా 839 టమాటాలు కాసేలా చేసాడు.దీంతో ఇతడు ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు.ఇంతకు ముందు ఉన్న రికార్డ్ ను స్మిత్ తిరగ రాసాడు.

2010 లో ఒక వ్యక్తి ఒకే చెట్టు కొమ్మకు 448 టమాటాలు పండించి రికార్డ్ నెలకొల్పగ ఇప్పుడు స్మిత్ ఏకంగా 839 టమాటాలు పండించి అతడి రికార్డ్ ను తుడిచి పెట్టాడు.ఇతడు చెర్రీ టమాటాలు పండించారు.

ఈ పండ్లను ఎక్కువుగా స్నాక్స్ తయారీ లో వాడుతారు.ఇవి చెర్రీ పండ్ల లాగానే ఉంటాయి.

ఇతడు ఐటీ కంపెనీలో పని చేస్తాడు.కానీ ఇతడికి మొక్కలు పెంచడం అంటే ఇష్టం.

అందుకే వినూత్న పద్దతిలో టమాటాలు పండించి రికార్డ్ నెలకొల్పాడు.

https://twitter.com/sweetpeasalads/status/1436389545218555904?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1436389545218555904%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.news18.com%2Fnews%2Ftrending%2Fbritish-man-sets-world-record-by-growing-839-tomatoes-from-a-single-stem-gh-vb-1036784.html
#Guinness World #Cherry Tomatoes #BritishWorld #British

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు