రోడ్డు ప్రమాదంలో వృద్దుడి మరణం .. భారత సంతతి వ్యక్తి డ్రైవింగ్‌ లైసెన్స్‌పై యూకే కోర్ట్ కీలక తీర్పు

వృద్ధుడిని తన కారుతో ఢీకొట్టి అతని మరణానికి కారణమైన భారత సంతతికి చెందిన బ్రిటీష్ పౌరుడికి కోర్టులో ఊరట లభించింది.తన రెస్టారెంట్ వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవడానికి వీలుగా అతను లైసెన్స్‌ను తిరిగి పొందాడు.వివరాల్లోకి వెళితే.36 ఏళ్ల సందీప్ సింగ్ ఫిబ్రవరి , 2014న డార్న్ లీ ప్రాంతంలోని నిట్‌షిల్ రోడ్‌లో బిల్లీ డన్‌లాప్‌ (71)ని తన బీఎండబ్ల్యూతో ఢీకొట్టాడు.ఈ ఘటనలో వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు.ప్రమాదకరమైన డ్రైవింగ్ ద్వారా వృద్ధుడి మరణానికి కారణమైనట్లు అతనిపై పోలీసులు అభియోగాలు మోపారు.దీనికి సంబంధించి 2016లో సందీప్‌కు కోర్ట్ నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది.అలాగే పదేళ్ల పాటు డ్రైవింగ్ చేయడానికి అనర్హుడిగా న్యాయస్థానం ప్రకటించింది.

 British-indian Who Killed A 71-year-old Man In Road Accident Gets Licence Back ,-TeluguStop.com

దీనిపై సందీప్ .గ్లాస్గో హైకోర్టులో అప్పీల్ చేయగా అతని పదేళ్ల డ్రైవింగ్ నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గించింది.తల్లిదండ్రుల ఆరోగ్యం , కుటుంబ రెస్టారెంట్ వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుని సందీప్‌‌కు డ్రైవింగ్ లైసెన్స్‌ను తిరిగి ఇప్పించింది.వ్యాపారానికి సంబంధించిన ఫ్రాంఛైజింగ్ అవసరాల నిమిత్తం యూకే, అమెరికా వెళ్లడానికి తనకు లైసెన్స్ అవసరమని సందీప్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.

అయితే లైసెన్స్ ఇచ్చేముందు డ్రైవింగ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాలని న్యాయస్థానం ఆదేశించింది.

Telugu America, British Indian, Licenses, Glasgow, Road, Sandeep Singh, Uk-Telug

విచారణ సందర్భంగా సందీప్ సింగ్, అతని కుటుంబ పరిస్ధితుల గురించిన మరింత సమాచారం ఇవ్వాలని న్యాయమూర్తి కోరారు.2016లో విచారణ సందర్భంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం సంభవించిందని సింగ్ నేరాన్ని అంగీకరించాడు.నాటి ఘటనలో డన్‌లప్ తల, చేతులు, కాళ్లు, పొత్తికడుపుపై తీవ్ర గాయాలయ్యాయి.అయితే సందీప్‌పై మోటరింగ్‌కు సంబంధించి గతంలో ఐదు నేరాలు వున్నట్లు తేలింది.2009 నుంచి 2011 మధ్య డ్రైవింగ్ చేస్తూ మొబైల్‌ని వినియోగించినందుకు సింగ్‌ని రెండు సార్లు విచారించారు.అలాగే మోటార్ వేలో వేగంగా నడపటం, రోడ్ టాక్స్ డిస్క్‌ను ప్రదర్శించడంలో విఫలమైనందుకు, రెడ్ లైట్‌ను క్రాస్ చేసినందుకు అతనిపై నేరాలు నమోదయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube