యూకేలో విషాదం : హెల్దీ మీల్స్ సృష్టికర్త.. భారత సంతతి సెలబ్రిటీ చెఫ్ కన్నుమూత

యూకేలో విషాదం చోటు చేసుకుంది.భారత సంతతికి చెందిన సెలబ్రిటీ చెఫ్ గురుపరీత్ బెయిన్స్ కన్నుమూశారు.

 British-indian Celebrity Chef Known For Creating Healthy Meals Passes Away, Gurp-TeluguStop.com

ఆయన వయసు 43 సంవత్సరాలు.తనను తాను ఫుడ్ డిస్ట్రప్టర్‌గా అభివర్ణించుకున్న గురుపరీత్.

సూపర్‌ఫుడ్‌లతో నిండిన ఆరోగ్యకరమైన భోజనాన్ని రూపొందించడంలో ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు.లండన్‌కు చెందిన గురుపరీత్‌కు గురువారం గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తోంది.

అతని మార్కెటింగ్ ఏజెన్సీ శుక్రవారం సోషల్ మీడియాలో గురుపరీత్ మరణంపై ప్రకటన చేసింది.

వెడ్జ్ స్నాక్స్‌కు గురుపరీత్ సహ వ్యవస్థాపకుడు.ఈ వెంచర్ ద్వారా ఆయన కూరగాయల ఆధారిత స్నాక్ బార్‌‌లను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించాడు.2009లో ఆయన తొలిసారిగా వెలుగులోకి వచ్చాడు.ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన భోజనంగా చెబుతూ.బ్లూబెర్రీస్, గోజీ బెర్రీ పిలావ్‌తో కూడిన చికెన్ కర్రీని గురుపరీత్ తయారు చేశారు.ఇందులో 23 ద్రాక్ష గుత్తులకు సమానమైన యాంటీ ఆక్సిడెంట్లు వున్నాయి.అలాగే ఆ ఏడాది తర్వాత బ్లూమ్స్‌బరీ ప్రచురించిన బైన్స్ తొలి రెసిపీ పుస్తకం ‘‘ ఇండియన్ సూపర్‌ఫుడ్’’ మంచి సక్సెస్‌ను అందుకుంది.

దీంతో ఫుడ్ రైటర్‌గా, న్యూట్రిషనిస్ట్‌గా గురుపరీత్ గుర్తింపును తెచ్చుకున్నారు.

Telugu Britishindian, Chef Award, Gurpareet Bains, Heart Attack, Superfood Diet-

ఇండియన్ సూపర్ ఫుడ్‌ పుస్తకం తర్వాత ‘‘ఇండియన్ సూపర్‌స్పైసెస్‌”ను ఆయన మార్కెట్‌లోకి తీసుకువచ్చారు.ఇందులో రోజువారీ వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్న వంటకాల గురించి ఆయన వివరించారు.ఈ రెండు బుక్స్ తర్వాత మూడవసారి ‘‘ ది సూపర్‌ఫుడ్ డైట్’’ను గురుపరీత్ అందుబాటులోకి తీసుకొచ్చారు.అలాగే 2011లో ‘‘ చెఫ్ ఆఫ్ ది ఇయర్ ’’ అవార్డు అందుకున్నారు.2020లో కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో ఆయన ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన కుక్కీని తయారు చేశారు.ఇందులో పండ్లు, కూరగాయలు వుంటాయి.ఈయన వంటలకు సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా అభిమానులే.అలాంటి గురుపరీత్ ఆకస్మిక మరణంతో యూకేలోని భారతీయ కమ్యూనిటీ విషాదంలో మునిగిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube