రిషి సునక్ ఈ పేరు తెలియని వారు ఉండరు, ఒక వేళ తెలియకపోతే ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు అంటే చటుక్కున తెలుస్తుంది.బ్రిటన్ ఆర్ధిక మంత్రిగా ఉన్న రిషి సునక్ చుట్టూ గడిచిన కొంత కాలంగా వివాదాలు తిరుగుతూనే ఉన్నాయి.
ప్రస్తుత బ్రిటన్ ప్రధాని బోరిస్ రాజీనామా చేస్తారని ఆ తరువాత బ్రిటన్ పధానిగా రిషి కి అవకాశం ఉందంటూ ఆ మధ్య అక్కడి స్థానిక మీడియాలో వచ్చిన వార్తలు మొదలు రిషి చుట్టూ ఎన్నో వివాదాలు నడుస్తున్నాయి.
రిషి సునక్ సతీమణి నారాయణ మూర్తి కూతురు అక్షతామూర్తి పరిమితికి మించిన ఆదాయం కలిగి ఉన్నారని గత కొన్ని నెలలుగా ఆమెపై బ్రిటన్ మీడియా వార్తలు గుప్పించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో రిషి సునక్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి కూడా పెరిగింది.బ్రిటన్ ప్రధాని పదవి కి ఎంపిక అవుతాడు అనే పరిస్థితి నుంచీ ఆయనపై ఆర్ధికపరమైన అనుమానాలు వ్యక్తమయ్యేలా వార్తలు ప్రచురితమయ్యాయి.
అయితే ఈ విషయంలో అక్ష్టతా మూర్తి క్లారిటీ ఇచ్చి వివాదాలకు తెరదించారు.అయితే తాజాగా
సండే టైమ్స్ పత్రిక బ్రిటన్ రిచ్ లిస్టు జాబితా పేరుతో సుమారు 250 మంది ధనికుల పేర్లు వెల్లడించింది.ఈ లిస్టు లో 222 స్థానలో భారత సంతతికి చెందిన బ్రిటన్ మంత్రి రిషి సునక్ దంపతుల పేర్లు కూడా ఉన్నాయి.ఈ ఇద్దరి మొత్తం సంపాదన మొత్తం 730 పౌండ్లు ఉన్నట్లుగా సదరు పత్రిక వెల్లడించింది.
అయితే బ్రిటన్ లో ఆర్ధిక పరిస్థితులు భవిష్యత్తులో మరింత ఇబ్బందిగా మారనున్నాయని రిషి హెచ్చరించి కొన్ని నెలలు గడవక ముందే రిచ్ లిస్టు పేరులో ఈ దంపతుల పేర్లు రావడం అక్కడ చర్చనీయాంశం అయ్యింది.