భారతీయుడికి జీవిత ఖైదు విధించిన బ్రిటన్ కోర్టు..రీజన్ ఏంటంటే..!!

నేరాలు చేసిన వాళ్ళు సహజంగా తామే ఆ నేరాన్ని చేశామని ఒప్పుకోరు పైగా తాము ఎలాంటి తప్పు చేయలేదని బుకాయిస్తారు, లేదంటే అసలు నేరం చేసినట్టుగా ఆధారాలు లేకుండా జాగ్రత్తపడుతారు.కానీ తామే ఆ తప్పు చేశామని తమని శిక్షించమని ఏ నేరస్తుడు నేరుగా ఒప్పుకోడు.

 British Court Sentences Indian To Life Imprisonment  British Court, Indian, Gig-TeluguStop.com

కానీ బ్రిటన్ లో ఓ భారత సంతతి వ్యక్తి మాత్రం తాను ఓ మహిళని హత్య చేసి నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి హత్య చేశాను నన్ను అరెస్ట్ చేయండి అంటూ లొంగిపోవడం సంచలనం సృష్టిస్తోంది.ఇంతకీ భారతీయ ఎన్నారై యువకుడు ఎందుకు ఆ మహిళని చంపాడు, అసలేం జరిగిందనే వివరాలోకి వెళ్తే.

జిగు కుమార్ సోర్తీ అనే 23 ఏళ్ళ యువకుడు భవిని ప్రవీణ్ అనే 21 ఏళ్ళ యువతిని ప్రేమించాడు.ఇద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు.ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.కొంత కాలం అయ్యాక ఇంట్లో చెప్పి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని అనుకున్న సమయంలో ప్రియుడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అతడికి చెప్పేసింది భవిని.

ఇకపై తన ముఖం కూడా చూడవద్దని, తనతో మాట్లాడవద్దని చెప్పి వెళ్ళిపోయింది.దాంతో తీవ్ర కలత చెందిన యువకుడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు.

దాంతో

బ్రిటన్ లోని లీసేస్టార్ లో ఆమె నివాసం ఉండే ఫ్లాట్ కు వెళ్లి కత్తితో దారుణంగా హత్య చేశాడు.ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత నేరుగా స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి లోగిపోయాడు.

పోలీసులకి జరిగిందంతా చెప్పాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టగా తప్పు ఒప్పుకున్నందుకు గాను అతడికి బ్రిటన్ కోర్టు యావజ్జీవ శిక్షని విధిస్తూ తీర్పు చెప్పింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube