భారతీయ మహిళా విద్యార్ధునిలకి కళ్ళు చెదిరే స్కాలర్   British Council Invites Indian Girls For Stems Course     2018-11-06   11:36:10  IST  Surya

బ్రిటన్ లో ఉన్నత విద్యని అభ్యసించాలని అనుకున్న ఓ మహిలకి కళ్ళు చెదిరే స్కాలర్ వరించింది. సైన్స్ , టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం సబ్జెక్టుల్లో మాస్టర్‌ డిగ్రీ చేయాలనీ భావించిన ఆమెకి ఒకటి కాదు రెండు కాదు దాదాపు రూ.9.49 కోట్ల(మిలియన్‌ పౌండ్లు) స్కాలర్‌షిప్‌ అందజేస్తున్నట్లు బ్రిటిష్‌ కౌన్సిల్‌తెలిపింది. ఈ మొత్తాన్ని బ్రిటన్‌ విశ్వవిద్యాలయాల్లో 2019–20 విద్యాసంవత్సరంలో మాస్టర్స్‌ కోర్సులో చేరే 70 మంది భారతీయ మహిళలకు ఇస్తామని వెల్లడించింది.

2018–19 విద్యా సంవత్సరంలో స్టెమ్స్‌ కోర్సుల్లో చేరిన 104 మంది భారతీయ మహిళలకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చామని కౌన్సిల్‌ భారత డైరెక్టర్‌ అలెన్‌ గెమ్మెల్‌ తెలిపారు.వీరంతా ఇంగ్లండ్, స్కాట్‌లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లో ఉన్న 43 ప్రతిష్టాత్మక విశ్వవిద్యాయాల్లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేశారని వెల్లడించారు.

British Council Invites Indian Girls For Stems Course-

బ్రిటన్‌లోని ఏ విశ్వవిద్యాలయంలో అయినా సరే 2019, జనవరి 30 నాటికి సీటు పొందిన అభ్యర్థులు ఈ స్కాలర్‌ షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని బ్రిటన్ పేర్కొంది..గతేడాది స్టెమ్‌ కోర్సులు పూర్తిచేసిన భారతీయ యువతుల్లో 50 శాతం కంటే ఎక్కువమంది భారత్‌లోని టైర్‌–2, టైర్‌–3 నగరాల నుంచే ఉన్నారని తెలిపారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.