దేవుడా .. ఆ రోగి కాళ్లు, చేతులను ముక్కలు చేసుకొని మరి..!?

పై ఫోటోలో బెడ్ పై పడుకొని చిరునవ్వు నవ్వుతున్న ఒక రోగి ని మనం చూడొచ్చు.అలాగే ఆ రోగి యొక్క కాళ్లు, చేతులు ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఉండటం కూడా మనం చూడొచ్చు.

 British Baker Ben Cullen Bakes Human Like Cake Viral Photo, Patient, Hand, Legs,-TeluguStop.com

ఇద్దరు నర్సులు ఆ కట్ చేసిన కాళ్ల, చేతి ముక్కలను ప్లేట్లో పెట్టుకుని తినడం చూస్తుంటే ఎవరికైనా భయం పుడుతుంది.ఈ ఫోటోలో కాళ్లు, చేతులు కట్ అయినా కూడా ఆ రోగి నవ్వుతూనే ఉండటం మరింత భయానికి కారణమౌతుంది.

కానీ అదేంటి ఓ మనిషి కాళ్లు, చేతులు నరికేస్తే నవ్వుతాడా? అనే డౌట్ మీకు రావచ్చు.కాళ్లు, చేతులు తీసేసిన ఆ వ్యక్తికి నొప్పి పుట్టదా అనే సందేహం కూడా కలగొచ్చు.

మీ సందేహాలకు, ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ ఫోటోని మరొకసారి పరిశీలించి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది.నిజానికి ఈ ఫోటోలో కనిపిస్తున్నది అసలు మనిషే కాదు.

ఆ కాళ్ళు, చేతులు నిజమైన శరీర భాగాలు కాదని కూడా ఈజీగా తెలుసుకోవచ్చు.ఇంతకీ ఇది ఏంటంటే.

ప్రముఖ బ్రిటిష్ బేకర్.బెన్ కల్లెన్ ప్రత్యేకంగా తయారుచేసిన కేక్.

విదేశాల్లో ఎక్కువగా వస్తువులను, జంతువులను పోలిన కేకులను తయారు చేస్తారు.ఈ ప్రత్యేకమైన కేకులన్నీ కూడా సహజత్వానికి చాలా దగ్గరగా ఉండేలా బేకర్స్ చాలా కష్టపడుతుంటారు.

ఇప్పటికే ఇంటర్నెట్లో కుక్కలను పోలిన కేక్ లను మనం చూసే ఉంటాం.

అయితే బ్రిటిష్ బేకర్ మాత్రం అచ్చం మనిషి లాంటి కేకును తయారు చేసి అందరికీ షాకిచ్చాడు.ఈ మనిషిని పోలిన కేక్ తయారు చేయడానికి ఎంత సమయం పట్టిందో కానీ నూటికి 99 శాతం సహజత్వం ఉట్టిపడేలా ఈ కేకు ఉండటం నిజంగా విశేషమే.అయితే హారర్4కిడ్స్ అనే ఓ ట్విట్టర్ అకౌంట్.

ముక్కలు ముక్కలుగా కట్ చేసిన ఈ కేక్ ఫోటోలను ఇంటర్నెట్ వేదికగా షేర్ చేయడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.తమకు పీడకలలు వచ్చేలాగా ఉన్నాయని కొంత మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube