YouTube: ఎలన్‌ మస్క్‌ వీడియోలు ఓపెన్ చేస్తున్నారా? జాగ్రత్త సుమీ!

అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ గురించి ప్రత్యేకించి ప్రస్తావన అవసరం లేదు.అతడు ఎంతమందికో రోల్ మోడల్.

 British Army Social Media Accounts Hacked And Posted Elon Musk Crypto Videos-TeluguStop.com

తాజాగా ట్విట్టర్ కొనుగోలు చేసే క్రమంలో ఎలాన్ మాస్క్ తరచూ న్యూస్ లో కనబడిన సంగతి తెలిసినదే.ఇకపోతే అతని అనుచరులు ఆయని పాఠాలను తూ చ పాటిస్తూ వుంటారు.

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టాలని అనుకునేవారు ఎలన్‌ మస్క్‌ చెప్పే క్రిప్టో ప్రిడిక్షన్స్‌ మీద ఆధారపడుతూ వుంటారు.అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేకమంది అతని వీడియోలు యూట్యూబ్ లో వింటూ వుంటారు.

ఇక దీన్నే టార్గెట్ చేస్తున్నారు హేకర్స్.

అవును, ఆయన పేరు మీదున్న యూట్యూబ్‌ వీడియోలు, ట్విట్‌ లింక్స్‌ ఓపెన్‌ చేస్తున్నారా? అయితే తస్మాత్‌ జాగ్రత్త.సైబర్‌ నేరస్తులు ఎలన్‌ మస్క్‌ ఫోటోలు, వీడియోలు చూపించి.బొమ్మ చూపెడుతున్నారు.సైబర్‌ నేరస్తులు రానురాను తెలివి మీరిపోతున్నారు.ఎలన్‌ మస్క్‌ ఫోటోల్ని, వీడియోల్ని చూపించి అమాయకుల్నే కాదు బ్రిటిష్‌ ఆర్మీని సైతం మోసం చేసినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి.

గార్డియన్‌ రిపోర్ట్‌ ప్రకారం.బ్రిటిష్‌ ఆర్మీకి చెందిన ట్విట్టర్‌ అకౌంట్‌లను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరస్తులు వాటి పేర్లను మార్చారు.

Telugu British, Crypto Currency, Elan, Hackers, Hacked, Teslaceo, Vidoes, Latest

ఇకపోతే, యూట్యూబ్‌లో సైతం ఎలన్‌ మస్క్‌ క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడిన వీడియోల్ని టెలికాస్ట్‌ చేశారు.ఎలన్‌ మస్క్‌ చెప్పినట్లు చేస్తే క్రిప్టో కరెన్సీలపై పెట్టుబడులు పెట్టి భారీ లాభాల్ని గడించవచ్చని నమ్మబలుకుతున్నారు.దీంతో అప్రమత్తమైన బ్రిటిష్‌ ఆర్మీ దేశ ప్రజలకు క్షమాణలు చెప్పుకోవలసి వచ్చింది.హ్యాకింగ్‌ జరిగిందని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపింది.ప్రస్తుతం హ్యాకింగ్‌ ఎవరు చేశారు.ఎక్కడి నుంచి చేశారనే అంశంపై బ్రిటిష్‌ ఆర్మీ విచారణ చేపడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube