ఏడుస్తున్నాడని మూడేళ్ల చిన్నారిని,కుటుంబాన్ని విమానంలో నుండి దించేశారు.  

British Airways Threw An Indian Family Out Of The Flight-

విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు భయపడ్డాడో ,మరే కారణం చేతనో కానీ ఏడుపందుకున్నాడు మూడేళ్ల చిన్నారి.తల్లిదండ్రులు ఎంత సముదాయించినా ఆ చిన్నారి ఏడుపాపలేదు.పక్కనే ఉన్న విమాన సిబ్బంది బాబుని ఊరుకోబెట్టాల్సింది పోయి బెదిరించేసరికి మరింత బెదిరిపోయి గుక్కపెట్టి పెద్దగా ఏడ్చాడు.

British Airways Threw An Indian Family Out Of The Flight--British Airways Threw An Indian Family Out Of The Flight-

అంతే బాబుతో సహా కుటుంబాన్ని విమానంలోనుండి ఎయిర్పోర్ట్లో దించేసి వెళ్లిపోయారు విమాన సిబ్బంది.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు.

లండన్ నుంచి బెర్లిన్‌కు వెళుతున్న బ్రిటీష్ ఎయిర్‌వేస్ సంస్థకు చెందిన విమానంలో (BA 8495) ఓ భారతీయ కుటుంబం కూడా ప్రయాణించింది.టేకాఫ్ అయ్యేముందు బాబుని సీట్లో కూర్చొబెట్టి సీట్ బెల్ట్ పెట్టింది తల్లి.దాంతో భయపడిన బాబు ఏడుపు అందుకున్నాడు.తల్లిదండ్రి ఎంత ఊరుకోపెట్టినా ఊరుకోలేదు.ఆ కుటుంబం వెనుక సీట్లలో కూర్చున్న మరో భారతీయ కుటుంబం ఆ బాబుని ఓదార్చడానికి ప్రయత్నించింది.అయినప్పటికి బాబు ఏడుపు ఆపలేదు.దీంతో విమాన సిబ్బందిలో ఒకరు “ఏడుపు ఆపుతావా లేదా,లేకపోతే కిటికిలోనుండి బయటకు తోసేస్తా ” అంటూ మాటలతో భయపెట్టేసరికి బాబు మరింత బెదిరిపోయాడు.

దీంతో బాబు ఏడుపు ఆపట్లేదని ఆ విమాన సిబ్బంది ఆ కుటుంబం బోర్డింగ్ పాసులు తీసుకుని లండన్‌లో దించేశారు.

ఈ విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తండ్రి పౌరవిమానయానాశాఖా మంత్రి సురేష్ ప్రభుకు లేఖ రాశాడు.విమానంలోని సిబ్బందిలో ఒకాయన తన కొడుకును దూషించాడని ఆ లేఖలో పేర్కొన్నాడు.వారి చర్యలకు తన కొడుకు బెదిరిపోయి మరింత గట్టిగా ఏడ్చాడని ,విమాన సిబ్బంది తమపై జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారని తెలిపాడు.తమకు జరిగిన అవమానంపై సీరియస్‌గా పరిగణించి ఆ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాబు తండ్రి లేఖలో సురేష్ ప్రభును కోరారు.

అయితే ప్రయాణికుడితో తాము టచ్‌లో ఉన్నామన్న విమాన యాజమాన్యం.జాత్యాహంకార వ్యాఖ్యలు చేసి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో క్షమించమని చెప్పింది.దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని యాజమాన్యం స్పష్టం చేసింది.