పాడు పని చేసేవారికి సమయం, స్థలంతో ఎలాంటి సంబంధం ఉండదు అనేదానికి తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనే ఉదాహరణగా నిలిచింది.పరువుగల ఉద్యోగం చేస్తూ కూడా పక్కదారి పట్టింది ఓ అమ్మడు.
దీంతో ఆమె చేసిన పని గురించి తెలుసుకున్న వారు నోరెళ్లబెట్టడమే కాకుండా ఆమె ఆ పని చేసిన తీరుపై మండిపడుతున్నారు.ఇక ఈ విషయం బట్టబయలు కావడంతో ఆమె ఉద్యోగం ఊడింది.
ఈ ఘటన బ్రిటిష్ ఎయిర్వేస్లో చోటు చేసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు.
బ్రిటిష్ ఎయిర్వేస్లో ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తున్న ఓ యువతి, సైడ్ బిజినెస్ చేయాలనే అత్యాశతో విమానంలో శృంగారం అందిస్తానంటూ ప్రకటన చేసింది.
విమానంలో తమకు నచ్చిన విధంగా తనతో శృంగారం చేసుకోవచ్చని, దాని కోసం తన ఫోటోలను చూసి డబ్బులు చెల్లించాలని అమ్మడు కండీషన్ పెట్టింది.ఇక తన హాట్ హాట్ ఫోటోలను కస్టమర్లకు ఎరగా చూపిన ఈ అమ్మడు, తన అండర్‌వేర్‌ను కూడా వేలానికి పెట్టింది.తన లోదుస్తులను కావాలనుకునే వారు ఏకంగా రూ.2500 చెల్లించి వాటిని సొంతం చేసుకోవచ్చని తెలిపింది.అయితే తన రేటులో మాత్రం ఎలాంటి డిస్కౌంట్ లేదని ఆమె తేల్చి చెప్పింది.ఈ ప్రకటన గురించి తెలుసుకున్న ఎయిర్వేస్ సిబ్బంది, ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు.
సదరు అమ్మడు ఎన్నేళ్లుగా ఈ గుట్టుచప్పుడు వ్యవహారం నడిపిస్తుందా అని బ్రిటిష్ ఎయిర్వేస్ యాజమాన్యం విచారణ చేపట్టింది.అంతేగాక అమ్మడుని తక్షణమే ఉద్యోగం నుండి తొలగిస్తున్నట్లు వారు తెలిపారు.
ప్రయాణికులు ఎవరూ ఇలాంటి చర్యలకు ఆకర్షితులు కావద్దంటూ హెచ్చరించారు.విమానంలో ఇలాంటి చర్యలకు పాల్పడితే అది చట్టరిత్యా నేరం అని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవని బ్రిటిష్ ఎయిర్వేస్ సంస్థ హెచ్చరించింది.