కరోనా నిర్మూలన అసాధ్యమంటున్న బ్రిటన్ శాస్త్రవేత్త..?

గడిచిన ఎనిమిది నెలలుగా కంటికి కనిపించని కరోనా వైరస్ భారత్ తో పాటు ఇతర దేశాల ప్రజల ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ మహమ్మారి బారిన అందరూ పడుతున్నారు.

 Britain Scientist John Edmunds Sensational Comments About Corona Virus,  Britain-TeluguStop.com

వైరస్ సోకినా త్వరగానే కోలుకుంటున్నప్పటికీ కరోనా బారిన పడ్డ వారిలో భవిష్యత్తులో ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

దేశంలోని చాలామంది ప్రజలు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే కరోనా మహమ్మారిని కట్టడి చేయవచ్చని భావిస్తున్నారు.

అయితే బ్రిటీష్ దేశానికి చెందిన జాన్ ఎడ్మండ్స్ మాత్రం కరోనా వైరస్ నిర్మూలన అసాధ్యమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.జాన్ ఎడ్మండ్స్ బ్రిటీష్ గవర్నమెంట్ అడ్వైజరీ కమిటీ సభ్యులలో ఒకరు.

ఆయన వైరస్ గురించి మాట్లాడుతూ ఈ వైరస్ ఎప్పటికీ ఉంటుందని.పూర్తిస్థాయిలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడం సాధ్యం కాదని తెలిపారు.
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే పరిస్థితిలో కొంత మార్పు రావచ్చని జాన్ ఎడ్మండ్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.బ్రిటన్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

శాశ్వతంగా కరోనాను నిర్మూలించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రం పరిస్థితి మరో విధంగా ఉంటుందని వెల్లడించారు.

డిసెంబర్ చివరినాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే కేసులు తగ్గుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా ప్రజల కోసం ఆరు వ్యాక్సిన్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు.

జాన్ ఎడ్మెండ్స్ కరోనా వైరస్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.మరోవైపు ఈ సంవత్సరం చివరినాటికి లేదా వచ్చే సంవత్సరం మొదటినాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube