కరోనా సెకండ్ వేవ్.... బ్రిటన్ ప్రధానికి మరోసారి

కరోనా సెకండ్ వేవ్ దాదాపు అన్ని దేశాల్లో కూడా తీవ్ర స్తాయిలో విజృంభిస్తుంది.ఈ క్రమంలోనే బ్రిటిష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మరోసారి కరోనా బారిన పడినట్లు తెలుస్తుంది.

 Britain Pm Tested Again Covid Positive, British Prime Minister Boris Johnson , C-TeluguStop.com

ఇదే ఏడాది ఏప్రిల్ లో బోరిస్ జాన్సన్ తొలిసారి కరోనా బారిన పడడం అనంతరం ఆయన పరిస్థితి తీవ్రం కావడం తో ఐసీయూ లో కూడా చికిత్స అందించి చివరికి క్షేమంగా బయటకు వచ్చారు.ఇంతలా కరోనా బ్రిటన్ ప్రధాని ని ఇబ్బంది పెట్టగా ఇప్పుడు తాజాగా మరోసారి ఆయన కరోనా బారిన పడినట్లు తెలుస్తుంది.

పార్లమెంటు సభ్యుడు ఒకరు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలో కొంత కాలంగా స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు.ఈ క్రమంలో ఆయనకు కూడా పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది అని బ్రిటన్‌ ప్రధాని అధికార నివాస వర్గాలు సోమవారం తెలిపాయి.

అధికారుల సూచనలను అనుసరించి ప్రధాని నవంబర్‌ 26 వరకూ తన ఇంటి నుంచే అధికారిక కార్యకలాపాలు చేపడతారని, కరోనా వైరస్‌ నిరోధానికి తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షిస్తారని నివాస వర్గాలు వివరించాయి.అయితే బోరిస్‌ జాన్సన్‌ కోవిడ్‌ బారిన పడినప్పటికీ ఆయనలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించడం లేదని తెలుస్తుంది.

గతేడాది నవంబర్ లోనే చైనా లో మొదలైన ఈ కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అల్లాడించిన విషయం విదితమే.ఇప్పటికి కూడా ప్రపంచ దేశాలు ఈ మహమ్మారి సెకండ్ వేవ్ కు అల్లాడిపోతున్నాయి.

Telugu Britishprime, Coronavirus, Covid, Johnsonjohnson-Telugu NRI

ఇదిలా ఉండగా.కోవిడ్‌–19 నియంత్రణకు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ అనుబంధ సంస్థ జాన్‌సెన్‌ తయారు చేసిన టీకా తుది పరీక్షలకు రంగం సిద్ధమైంది.యూకే మొత్తమ్మీద 6వేల మందికి ఈ టీకా ఇచ్చి 12 నెలలపాటు పరీక్షించనున్నట్లు తెలుస్తుంది.దశలవారీగా ఈ టీకా పరీక్షల కోసం ఆరు దేశాల బ్రిటన్ నుంచి సుమారు 30 వేల మందిని ఎంపిక చేస్తామని తెలిపింది.

మరోపక్క డబ్ల్యు హెచ్ ఓ కూడా సెకండ్ వేవ్ తో చాలా జాగ్రత్త అని హెచ్చరిస్తుంది.రెండోసారి కరోనా బారిన పడిన వారిలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది అని వారు హెచ్చరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube