కారు స్పీడ్ గా నడిపిన ఎంపీ.... పదవి పోయింది

ఎంపీ పదవి కాస్తా ఊడిపోయింది.అయితే దీనికి కారణం తెలిస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోతారు.

 Britain Mp Rash Driving-TeluguStop.com

కారు స్పీడ్ గా నడిపిన కారణంగా ఎంపీ గారి పదవి పోయిండట.ఏంటి స్పీడ్ గా డ్రైవ్ చేస్తే పదవి పోతుందా అని ఆలోచిస్తున్నారా.

ఇంతకీ ఇదంతా మన ఇండియా లో కాదులేండీ.బ్రిటన్ లో జరిగింది ఇదంతా.

వివరాల్లోకి వెళితే…పెటార్బోరో కు చెందిన లేబర్ పార్టీ ఎంపీ ఫియోనా ఒనసన్య 2017 లో ర్యాష్ డ్రైవింగ్ చేశారు.పోలీసులను ఉద్దేశ్యపూర్వకంగానే తప్పు దోవ పట్టించి ర్యాష్ డ్రైవింగ్ చేసినట్లు నిరూపితం అవ్వడం తో ఆమె తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది.

అదే ఇండియా లో అయితే ఈ గొడవ లేమీ ఉండవు కద

అసలు ఎంపీ గారు వస్తున్నారు అంటేనే పెద్ద ప్రోటోకాల్ పాటించి రోడ్డు పైన ఎవరూ లేకుండా ట్రాఫిక్ ను నివారిస్తూ వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు.ఈ సందర్భంలో ప్రజలు ఇబ్బందులు పడినా పెద్ద గా ఏమీ పట్టించుకోరు కూడా.

బ్రిటన్ లో కాబట్టి ఎంపీ పరిస్థితి కూడా సామాన్య వ్యక్తి కి ఎలాంటి శిక్షలు పడతాయో అదే విధంగా ఆమె పరిస్థితి కూడా తయారైంది.ఆమెకు జైలు శిక్ష కూడా పడినట్లు తెలుస్తుంది.

దీనితో పార్టీ డిసిప్లినరీ యాక్షన్ కింద ఆమెను పదవి నుంచి తొలగించారు.అంతేకాకుండా ఆమె కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

జులై 23, 2017 లో ఈ ఘటన చోటుచేసుకోగా ప్రస్తుతం కోర్టులో ఈ కేసు నడుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube