సామాజిక దూరం కోసం సైకిల్ సవారీ... ఆ దేశాలలో ప్రయోగం

కరోనా వైరస్ ప్రపంచ దేశాలకి విస్తరించేసింది.అన్ని దేశాలు భవిష్యత్తులో కరోనాతో కలిసి బ్రతకాల్సిందే అని ప్రతి ఒక్కరు ఇప్పటికే స్పష్టం చేసేస్తున్నారు.

 Britain Government Support Cycles For Office Duty, Lock Down, Corona Effect, Cov-TeluguStop.com

ఒక్క సామాజిక దూరం ద్వారా మాత్రమే కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చని సూచిస్తున్నారు.అయితే నిత్యం వాహనాలలో సుదీర్ఘంగా ప్రయాణాలు చేసే ప్రజలు బస్సులు, రైళ్ళు, విమానాలలో సామాజిక దూరం పాతించలేని పరిస్థితి నెలకొని ఉంది.

మరి ఇలాంటి సమయంలో మనిషికి, మనిషికి మద్యం దూరం ఉండాలంటే కచ్చితంగా సొంత వాహనాలని కలిగి ఉండాలి.యూరోపియన్ దేశాలు ఈ దిశగా ప్రజల మద్యం భౌతిక దూరం కోసం కొత్త ప్ర‌య‌త్నాలు ప్రారంభించాయి.

సామాజిక దూరాన్ని దూరాన్ని పాటించ‌డం కోసం కార్యాలయాల‌కు సైకిళ్ల‌పై వెళ్లే విధానాన్ని బ్రిటన్ సర్కార్ ప్రోత్సహిస్తుంది.దానికోసం ఏకంగా 250 మిలియన్ డాలర్లు ఖర్చు చేసి, ఎమర్జెన్సీ యాక్టివ్ ట్రావెల్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది.

మరోవైపు త‌ర‌చూ భారీగా సైకిల్ రేసులు నిర్వ‌హించే ఫ్రాన్స్ సైకిలింగ్‌ను ప్రోత్స‌హించేందుకు 20 మిలియన్ యూరోలు ఖర్చు చేయడానికి సిద్ధ‌మ‌య్యింది.ఆమ్‌స్ట‌ర్‌డామ్‌, నెదర్లాండ్స్‌లోని ఉత్త‌ర‌ ఐరోపాలో‌ చాలా నగరాల్లో ఇటువంటి ప్ర‌య‌త్నాలే జ‌రుగుతున్నాయి.

కాగా వాన్‌మూఫ్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ సైకిళ్లను విక్ర‌యిస్తుంటుంది.సంస్థ‌ అమ్మకాలు ఫిబ్రవరి, మార్చి మధ్య కాలంటో 48 శాతంమేర‌కు పెరిగాయి.

ఇక ఎలక్ట్రికల్ సైకిల్స్ ని ప్రోత్సహించడం వలన కాలుష్య ప్రభావం తగ్గడంతో పాటు, ఉద్యోగులు సమయానికి కంపెనీకి వెళ్లిపోవచ్చు.అలాగే భౌతిక దూరం కూడా పాటించినట్లు అవుతుంది.

వీటిని దృష్టిలో ఉంచుకొని సైకిల్ సవారీగా బ్రిటన్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube