బ్రిస్బేన్ టెస్ట్: మొదటి ఇన్నింగ్స్ లో ఆసిస్ కే ఆధిక్యం..!

టీమ్ ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ లో భాగంగా తాజాగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఆధిక్యం సంపాదించింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

 Brisbane Test, Aussies, Lead , First Innings, Indian Team, 72 Runes, 98 Overs, W-TeluguStop.com

టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌట్ కాగా.ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమ్ ఇండియా 336 పరుగులకు ఆలౌట్ అయింది.

దీంతో ఆస్ట్రేలియాకు 33 పరుగుల ఆధిక్యం మొదటి ఇన్నింగ్స్ లో లభించింది.

ఇక టీమిండియా బ్యాట్స్మెన్స్ మొదట్లో కాస్త తక్కువ పరుగులకే ఒక్కొక్కరుగా వెనుతిరుగుతుండగా ఆ సమయంలో బ్యాటింగ్ వచ్చిన శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని వారి సత్తాను నిరూపించారు.

వారిద్దరూ నిలకడైన బ్యాటింగ్ తో వరల్డ్ క్లాస్ బౌలింగ్ ను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.ఈ క్రమంలోనే వీరిద్దరూ వారి టెస్ట్ కెరీర్ లో మొదటి హాఫ్ సెంచరీలను నమోదు చేసుకున్నారు.

ఇందులో శార్దుల్ ఠాకూర్ భారీ సిక్సర్ తో అర్ధ శతకాన్ని సాధించడం జరిగింది.ఠాకూర్ అర్థ శతకం సాధించిన తర్వాతి ఓవర్లో నే వాషింగ్టన్ సుందర్ కూడా తన హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు.

విరిద్దరూ కలిసి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఇక భారత బ్యాటింగ్ విభాగంలో వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్ ఇద్దరు హాఫ్ సెంచరీలు మినహాయించి ఎవరు భారీస్కోరు చేయలేకపోయారు.

ఆస్ట్రేలియా బౌలర్లు విషయానికి వస్తే.హజల్ వుడ్ 57 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకోగా.

మిచెల్ స్ట్రాక్ 2 వికెట్లు, కమ్మిన్స్ 2 వికెట్లు, లియోన్ 1 వికెట్ తీసుకున్నారు.ప్రస్తుతం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్సును మొదలు పెట్టింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube