ఏంటీ.. వంకాయ తింటే బ‌రువు త‌గ్గుతారా..??

కూర‌గాయ‌ల్లో రారాజు అయిన వంకాయ గురించి తెలియ‌ని వారుండ‌రు.దీని రుచి చూడ‌ని వారూ ఉండ‌రు.

 Brinjal Is Good For Weight Loss-TeluguStop.com

ఆత్రేయపురపు వంగ, ముండ్ల వంగ, కస్తూరి వంగ, నీటి వంగ, గుత్తి వంగ ఇలా ర‌క‌ర‌కాల వంకాయ‌లు మ‌న‌కు మార్కెట్‌లో ల‌భ్య‌మ‌వుతున్నాయి.వంకాయల‌‌తో ఎన్నో ర‌కాల వంట‌లు చేస్తారు.

ఏ ర‌కంగా చేసినా.వంకాయ టేస్టే వేరంటారు కొంటారు.

 Brinjal Is Good For Weight Loss-ఏంటీ.. వంకాయ తింటే బ‌రువు త‌గ్గుతారా..-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే వంకాయ‌తో రుచిక‌ర‌మైన వంట‌లే కాదు.అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కూడా చెక్ పెట్ట‌వ‌చ్చు.

వంకాయ‌లో విటమిన్లు, ఖనిజాలు కీలకమైన ఫైటో పోషకాలు పుష్క‌లంగా ఉన్నాయి.అలాగే వంకాయలో విటమిన్ సి ఉంటుంది.ఇది వ్యాధులు, వైర‌ల్‌ ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చేస్తుంది.అదే స‌మ‌యంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని బ‌లోపేతం చేస్తుంది.

అలాగే వంకాయ‌ల‌ను వారంలో క‌నీసం రెండు సార్లు అయినా తింటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

వంకాయల వ‌ల్ల మ‌రో ప్ర‌యోజ‌నం ఏంటంటే.

శరీరంలో కొవ్వులను కరిగించే శ‌క్తి వీటిలో స‌మృద్ధిగా ఉంది.బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు ఖ‌చ్చితంగా వారంలో రెండు సార్లు వంకాయ‌ల‌ను తిన‌డం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అదేవిధంగా, వంకాయలో ఉంటే పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ3, బీ6, యాంటీఆక్సిడెంట్లు తదితర పోషకాలు గుండె జ‌బ్బులు ముఖం గుండె పోటు వ‌చ్చే రిస్క్‌ను త‌గ్గిస్తుంది.అలాగే శ‌రీరంలో షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కూడా వంకాయ‌లు కంట్రోల్ చేయ‌గ‌ల‌వు.

కాబ‌ట్టి, వంకాయ‌ల‌తో చేసే రెసిపీస్‌ను వారంలో క‌నీసం రెండు లేదా మూడు సార్లు తీసుకోండి.

#Health Benefits #Health Tips #HealthBenefits #Eating Brinjal #Brinjal

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు