సాధారణంగా మనం రోజువారీ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో పనులు చేస్తూ ఉంటాము.ఈ క్రమంలోనే మనకు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటాం.
ఈ విధంగా చేసే కొన్ని పొరపాట్లు ఎన్నో సమస్యలకు కారణమవుతాయి.అయితే ఇలాంటి విషయాలను కొందరు భావిస్తారు మరి కొందరు ఎంతో విశ్వసిస్తారు.
అయితే ఈ పద్ధతులను పాటించాలా లేదా అనేది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం.కానీ మన పెద్దవారు కొన్ని సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించేవారు.
ఈ క్రమంలోనే మనం మన ఇంట్లో చేయకూడని పనులు ఏమిటి ఇక్కడ తెలుసుకుందాం.
చాలామంది పొద్దెక్కిన తర్వాత నిద్ర లేచి వాకిలి ముందు నీటిని చల్లుకుంటారు.
అలా చేయకూడదు.అదేవిధంగా నిద్రలేచిన వెంటనే దుప్పటి తప్పనిసరిగా మడిచి పెట్టాలి లేకపోతే దరిద్ర దేవత కొలువై ఉంటుంది.
భోజనం చేసిన తర్వాత ఎంగిలి కంచం ముందు చాలా సేపు కూర్చొని ఉంటారు.అలా ఎప్పుడు ఎంగిలి కంచం ముందు కూర్చోకూడదు.
పూజ గదిలో ఒకే దేవుడికి చెందిన రెండు ఫోటోలు ఉండకూడదు.అదే విధంగా విగ్రహాలు అయితే ఎత్తు చాలా తక్కువగా ఉండాలి.
మనం పూజ చేసే సమయంలో ఉదయం సాయంత్రం ఖచ్చితంగా దేవుని ముందు నీరు పెట్టాలి.
దేవుని గదిలో ఒక్క ప్రమిదం పెట్టే పెట్టేవారు మూడు వత్తులను వేయాలి.రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రమిదలు వెలిగించేవారు రెండు వత్తులను వేసి దీపారాధన చేయాలి.రోజు దీపారాధనకు మన శక్తికి తగ్గ నూనెను ఉపయోగించవచ్చు.
కానీ ఏదైనా ప్రత్యేక పూజలు చేసే సమయంలో అనగా వ్రతాలు, నోములు చేసే సమయంలో తప్పనిసరిగా దీపారాధన నూనె మాత్రమే వాడాలి.అదేవిధంగా నువ్వుల నూనె, ఆవు నెయ్యి వంటివాటితో పూజ చేయాలి.
అదే విధంగా సాయంత్రం 6 గంటలు దాటితే నూనె, సూది, ఉప్పు, కోడిగుడ్లను ఇంటికి తెచ్చుకోకూడదు.ఇది శని స్థానాలు కావడం ద్వారా శని కొనితెచ్చుకున్నట్లుగా అవుతుంది.
కనుక పొరపాటున కూడా ఇలాంటి పనులు అసలు చేయకూడదు అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.