టాలివుడ్ హీరో ఆఫ్ ది ఇయర్ ఎవరు?

చూస్తుండగానే మరో ఏడాది గడిచిపోయింది.2016 చివరిరోజుల్లోకి అడుగుపెట్టింది.ఈ ఏడాది టాప్ 6 హీరోల్లో ప్రభాస్ మినహా అందరు తమ సినిమాల్ని బాక్సాఫీస్ వద్ద వదిలారు.ఇక సీనియర్ హీరోల్లో చిరంజీవి మినహా మిగితా ముగ్గురి సినిమాలు ఏ ఏడాది ప్రేక్షకులని పలకరించాయి.

 Brief Note : Who Is Tollywood Hero Of The Year?-TeluguStop.com

డిక్టేటర్ తో బాలకృష్ణ అపజయాన్ని అందుకుంటే, బాలకృష్ణతో పాటే సంక్రాంతికి వచ్చిన నాగార్జున బాక్సాఫీసుని బద్దలు కొట్టాడు.సోగ్గాడే చిన్నినాయన రూపంలో కెరీర్ బెస్ట్ గ్రాసర్ ని అందుకున్నాడు.

అదే పండగపూట వచ్చిన ఎన్టీఆర్, నాన్నకు ప్రేమతో చిత్రంతో కలెక్షన్లు భారిగా దండుకోకపోయినా, ఇమేజ్ పరంగా, ఓవర్సీస్ బాక్సాఫీస్ లెక్కల్లతో చూస్తే, భారీ బ్లాక్ బస్టర్ సాధించినట్టే.ఊపిరితో మళ్ళీ మెరిసిన నాగ్, తన ఖాతాలో మరో హిట్ ని, ఓ క్లాసిక్ ని వేసుకున్నాడు.

ఇక టాప్ 2 హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.ఎప్పుడు కలెక్షన్ల విషయంలో పోటి పడే వీరిద్దరు, ఈసారి నష్టాల విషయంలో పోటిపడ్డారు.

సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం .రెండు ఈ ఏడాదికి రెండు అతిపెద్ద డిజాస్టర్ సినిమాలు.సమ్మర్ లో వచ్చిన బన్ని, సమ్మర్ లో మరో బ్లాక్ బస్టర్ సాధించి, ఎన్నాళ్ళుగానో ఊరిస్తున్న 70 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు.సరైనోడు ఈ ఏడాది రెండొవ అతిపెద్ద గ్రాసర్ గా నిలిచింది.

వెంకటేష్ బాబు బంగారం యావరేజ్ గా నిలిచింది.ఇక ఈ ఏడాది వచ్చిన చిత్రాలన్నీ ఒకవైపు, జనతా గ్యారేజ్ ఒకవైపు.క్రిటిక్స్ నుంచి ప్రశంసలు లభించకున్నా, ప్రేక్షకుల మెప్పు మాత్రం పొందిన ఈ చిత్రం, ఏకంగా 80 కోట్ల షేర్ వసూళ్ళు సాధించి తారక్ కెరీర్ ని మరో ఎత్తుకి చేర్చింది.2016 కి అతిపెద్ద గ్రాసర్ ఈ చిత్రం.

చరణ్ ధృవ థియేటర్లలో ఇంకా ఆడుతోంది.అన్ని చిత్రాలకన్నా బెస్ట్ రివ్యూలు ఈ చిత్రానికి వస్తే, కరెన్సి బ్యాన్ ఎఫెక్టు వల్లనేమో, నష్టాలతోనే బాక్సాఫీస్ పరుగుని ముగించేలా ఉంది.

అయితే ధృవ చరణ్ కి అవసరమైన ఇమేజ్ చేంజ్, ఓవర్సీస్ మార్కేట్ ని అందించింది.

టాప్ హీరోలు, టాప్ చిత్రాలు పక్కనపెడితే, నాని మూడు హిట్స్ కొట్టాడు.

పెళ్ళిచూపులు ఈ ఏడాదికి అత్యంత లాభాకరమైన సినిమాగా నిలిచింది.నితిన్ అఆ బాగా ఆడింది.

నాగచైతన్య ప్రేమమ్ తో హిట్, సాహసం శ్వాసగా సాగిపోతో ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు.పోటిలో కూడా ఎక్స్ ప్రెస్ రాజా బాగా ఆడింది.

ఈ డిస్కషన్ ఇక్కడితో ఆపేసి, హీరో ఆఫ్ ది ఇయర్ అనే టాపిక్ మీదకి వస్తే, చెరో రెండు చిత్రాలతో మెప్పించిన నాగార్జున, ఎన్టీఆర్ పోటీదారులు.ఇద్దరు క్లాస్ ఆడియేన్స్ ని ఓ సినిమాతో, మాస్ ఆడియెన్స్ మరో సినిమాతో మెప్పించారు.

కఠిన నిర్ణయమే అయినా, తన బాక్సాఫీస్ స్టామినాని శంకిస్తున్న సమయంలో, మూస హీరో అయిపోయాడు అనే కామెంట్స్ వినిపిస్తున్న కాలంలో, ఇటు తన అభినయంతో కొత్త అభిమానుల్ని సంపాదించుకుని, తెలుగు సినిమా చరిత్రలో మూడొవ అతిపెద్ద హిట్ (జనతా గ్యారేజ్) తన పేరు మీద రాసుకున్న ఎన్టీఆర్ మా దృష్టిలో “హీరో ఆఫ్ ది ఇయర్ 2016”.ఏమంటారు ?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube