70 ఏళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి చివరికి 8 సెకన్ల లో ఏమి చేశారంటే

70 ఏళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి ని అధికారులు పూర్తిగా కూల్చివేసినట్లు తెలుస్తుంది.ఈ ఘటన ఇటలీ లో చోటుచేసుకుంది.

 Bridgedemolish 1 1telugustop In Italy-TeluguStop.com

ఇటాలియన్ పోర్ట్ సిటీ లోని జెనోవా లో ఉన్న మొరండి బ్రిడ్జి ని ఇంజనీర్లు కూలగొట్టినట్లు తెలుస్తుంది.గతేడాది కొంతభాగం ఈ వంతెన కూలడం తో 43 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ క్రమంలో అంతర్జాతీయంగా తీవ్ర విమర్సలు వెల్లువెత్తిన నేపథ్యంలో మిగిలిన బ్రిడ్జి భాగాన్ని కుడా ఇంజనీర్లు కూల్చివేసినట్లు తెలుస్తుంది.ఈ ప్రమాదం జరిగిన 10 నెలల తరువాత ఈ బ్రిడ్జ్ ను కేవలం 8 సెకన్ల వ్యవధి లోనే పూర్తిగా నేలమట్టం చేశారు.

ఈ బ్రిడ్జి ని కూల్చివేయడం కోసం దాని అడుగు భాగంలో శక్తివంతమైన డిటోనేటర్లు అమర్చి మరి బ్రిడ్జ్ ని పేల్చి వేశారు.

70 ఏళ్ల క్రితం నిర్మించిన బ్రి�

అయితే ఈ బ్రిడ్జ్ కూల్చివేత కార్యక్రమంలో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యల నేపథ్యంలో చుట్టు పక్కల భవనాల్లో ఉంటున్న సుమారు 4వేల మందిని అధికారులు ఖాళీ చేయించినట్లు తెలుస్తుంది.అంతేకాకుండా బ్రిడ్జ్‌ను కూల్చిన వెంటనే వెలువడే దుమ్ము చుట్టుపక్కల వ్యాపించకుండా పెద్ద ఎత్తున నీళ్ల ట్యాంకులను ఏర్పాటు చేసి మరి బ్రిడ్జ్ ని నేలమట్టం చేసినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube