పెళ్లి రోజు కూడా ల్యాప్ టాప్ ముందరేసుకుని పని చేసిన పెళ్లి కూతురు…పాపం పెళ్లి కొడుకు…

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న సంగతి గురించి అందరికీ తెలిసిందే.

దీంతో ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి.

ఈ లాక్ డౌన్ లో భాగంగా కొన్ని ప్రైవేటు మరియు ప్రభుత్వ సంస్థలు తమ సంస్థలో పని చేసేటువంటి ఉద్యోగులకు ఇంటి నుంచే సౌకర్యం కల్పించారు.

దీంతో ఉద్యోగులు ఒక పక్క పని చేస్తూనే మరోపక్క తమ కుటుంబ సభ్యులతో జాలిగా గడుపుతున్నారు.

అయితే ఇంతకీ విషయం ఏంటంటే ఈ మధ్య ఓ పెళ్లి కూతురు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నటువంటి ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఇందులో ఆశ్చర్య పోవడానికి ఏముందని అనుకుంటున్నారా.మరోమారు ఆ వీడియోని పరిశీలించినట్లయితే తన పెళ్లి రోజును సైతం లెక్క చేయకుండా పెళ్లి కూతురు ల్యాప్ టాప్ ముందు పెట్టుకుని కష్ట పడి పని చేస్తోంది.

దీంతో పెళ్లికి వచ్చిన బంధువులు ఈ విషయాన్ని గమనించి వీడియోలు తీసి సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేశారు.

ప్రస్తుతం కొందరు నెటిజన్లు ఈ వీడియో ని తెగ వైరల్ చేస్తున్నారు.అంతేగాక ఆమె పని చేస్తున్నటువంటి సంస్థ ఏదైనా సరే ఈ సంవత్సరపు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ని పెళ్లి రోజు కూడా కష్టపడి పని చేసినటువంటి యువతికి ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు.

అలాగే మరి కొంతమంది మాత్రం అసలు ఆమె పెళ్లి రోజు కూడా పనిచేస్తుందంటే ఆమె కష్టపడే తత్వానికి హ్యాట్సాఫ్ అంటున్నారు.

అమెరికాలో భారతీయ విద్యార్ధి మృతి .. ‘‘ బ్లూ వేల్ ఛాలెంజే ’’ కారణమా ..?