కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఏపీ,తెలంగాణా ల తరహా లో మధ్యప్రదేశ్ లో కూడా

ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో షాదీ ముబారక్,కల్యాణ లక్ష్మి పధకాల మాదిరి గానే మధ్యప్రదేశ్ లో కూడా ఒక పధకాన్ని ప్రవేశపెట్టింది.ఇంతకీ ఆ పధకం ఏమిటంటే అత్తారింట్లో టాయి లెట్ ఉంటే ఆ పెళ్లి కూతురికి రూ.50 వేల నగదు అందుతుందట.మామూలుగా పెళ్లి సమయంలో ఎవరికైనా కూడా ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో నగదు అనేది పేద వారికి ఇస్తూ ఉంటారు.

 Brides From Ebcs Are Eligible To Get 50000 Rupees In Madhya Pradesh-TeluguStop.com

అయితే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వినూత్నంగా ఇలా పెళ్లికూతురు అత్తారింటిలో బాత్ రూమ్ ఉంటె మాత్రమే 50 వేల రూపాయల నగదు అందిస్తాం అంటూ షరతు విధించింది.అయితే స్వచ్ఛ భారత్ లో భాగంగా కాంగ్రెస్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

అయితే ఎప్పుడూ కూడా బీజేపీ పధకాలను తప్పుపట్టే కాంగ్రెస్ పార్టీ ఈ స్వచ్ఛ భారత్ విషయంలో మాత్రం ఆ పార్టీ కి సపోర్ట్ గా నిలబడుతుంది.

అయితే ఈ తాజా పధకం తో ప్రతి ఒక్కరూ కూడా టాయి లెట్ లు నిర్మించడానికి నిర్ణయించుకుంటారు అన్న ఉద్దేశ్యం తో కాంగ్రెస్ ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.మొత్తానికి అక్కడ ప్రజల్లో టాయి లెట్ పై అవగాహన కల్పించడం కోసం కాంగ్రెస్ ఇలా ఈ కొత్త షరతు తో పెళ్లి కూతురికి రూ.50 వేలు అందించడానికి సిద్ధమైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube