పెళ్లి రోజున వాంతులు చేసుకున్న వధువు... వరుడు చేసిన పనికి పెళ్లి వద్దన్న వధువు

ప్రస్తుతం పెళ్లిల సీజన్‌ నడుస్తుంది.దేశ వ్యాప్తంగా కొన్ని వేల లక్షల పెళ్లిలు జరుగుతున్నాయి.

 Bride Vomitings On The Day Of Her Marriage-TeluguStop.com

ఇన్ని పెళ్లిలలో ఒకటి రెండు పెళ్లిలు ఆగిపోవడం జరుగుతుంది.అయితే అవి ఆగిపోవడంకు కారణం వింత వింతగా ఉంటాయి.

కొన్ని పెళ్లిలు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోతే మరి కొన్ని పెళ్లిలు మాత్రం ఎవరైనా చనిపోవడం వల్ల ఆగిపోతాయి.కొన్ని పెళ్లిలు మాత్రం ప్రేమ వ్యవహారాల కారణంగా ఆగిపోతాయి.

అయితే చాలా అరుదైన సంఘటనలతో కొన్ని పెళ్లిలు ఆగిపోతాయి.ఇప్పుడు ఆ అరుదైన ఒక సంఘటన గురించి చర్చిద్దాం

కర్ణాటక రాష్ట్రంలో ఈ అరుదైన పెళ్లి క్యాన్సిల్‌ సంఘటన జరిగింది.

రాష్ట్ర రాజధాని బెంగళూరులోని శివారు ప్రాంతంలో శరత్‌ మరియు స్థానిక యువతికి పెళ్లి పిక్స్‌ అయ్యింది.పెళ్లికి అంతా సిద్దం అయిన సమయంలో కొన్ని నెలల క్రితం వదువు తల్లి చనిపోయింది.

పెళ్లి 15 రోజులు ఉండగా తల్లి చనిపోవడంతో పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకున్నారు.చనిపోయిన మహిళ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసిన తర్వాత నెల రోజుల్లో పెళ్లి ముహూర్తం ఫిక్స్‌ చేశారు.

ఈసారి పెళ్లికి ఎలాంటి అడ్డు లేదు, కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాను అని ఆమె మరియు అతడు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పెళ్లి రోజున వధువు వాంతులు చేసుకుంది.కళ్లు తిరిగినట్లుగా ఉండటంతో ఆమె నీరసంగా కనిపించిందట.దాంతో శరత్‌ ఆమెను హాస్పిటల్‌కు తీసుకు వెళ్లాడు.

అక్కడ ఆమె కన్యత్వ పరీక్షలు మరియు గర్బవతా అనే పరీక్షలు చేయించాడు.వైద్యులు అవి అజీర్తి వల్ల వచ్చిన వాంతులుగా గా నిర్దారించారు.

అయితే ఆమె కన్యత్వ పరీక్షలు చేయించడంతో బాగా నొచ్చుకుంది.తనను ఇప్పుడే ఇలా అనుమానించిన వ్యక్తితో జీవితాంతం ఎలా కలిసి బతకడం అని భయపడింది.

అతడు ఎంత చెప్పినా వినకుండా, కుటుంబ సభ్యులకు తాను ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోను అంటూ చెప్పేసింది.కుటుంబ సభ్యులు కూడా ఆమె చెప్పినట్లుగానే పెళ్లిని క్యాన్సిల్‌ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube