ప్రియుడి పెళ్లి అని తెలిసి ప్రియురాలు ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు !

వారు ఒక్కప్పుడు ప్రేమికులు.కొంత కాలం పాటు డేటింగ్ చేసుకున్నారు.ఆ తర్వాత ఏవో మనస్పర్థలు రావడంతో విడిపోయారు.ఇదంతా జరిగి 4 సంవత్సరాలు అవుతుంది.ఆ ప్రియుడు అదంతా మర్చిపోయి ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు.అయితే పెళ్లి చేసుకునేటప్పుడు తన మాజీ ప్రియురాలు పెళ్ళిలో ఎంట్రీ ఇవ్వడంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఆ ప్రియుడు అయితే బ్రేక్ అప్ తర్వాత అన్ని మర్చిపోయాడు.కానీ ప్రియురాలు అతడికి పెళ్లి అనే విషయం తెలీగానే అతడినే పెళ్లి చేసుకోవాలని ఏకంగా పెళ్లి జరిగే మండపానికి వచ్చేసింది.

 Bride Shocked As Fiances Ex Shows Up At Wedding Asking Him To Be Married To Her Too-TeluguStop.com

ప్రియుడు ఆ మండపం దగ్గర తన మాజీ ప్రియురాలిని చూడగానే షాక్ అయ్యాడు.అతను మండపం మీద పెళ్లి కూతురు తో కలిసి కూర్చుని ఉండగానే ప్రియురాలు కూడా వచ్చి నన్ను కూడా పెళ్లి చేసుకో అనే అతడి పక్కనే కూర్చుంది.

అప్పటి వరకు నవ్వుతు ఎంతో సంబరపడిపోతూ ఉన్న పెళ్లి కూతురు మొహం కాస్త వెలవెలబోయింది.ఈ ఘటన ఇండోనేషియాలో జరిగింది.

 Bride Shocked As Fiances Ex Shows Up At Wedding Asking Him To Be Married To Her Too-ప్రియుడి పెళ్లి అని తెలిసి ప్రియురాలు ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ పెళ్లి కొడుకు పేరు కొరిక్.అతడు ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ అయ్యింది.

అతడికి నూర్ అనే యువతితో పెళ్లి కుదిరింది.అయితే అతడి మాజీ ప్రియురాలికి ఈ విష్యం తెలిసింది.

హుటాహుటిన పెళ్లి మండపానికి చేరుకొని నన్ను కూడా పెళ్లి చేసుకోవాల్సిందే అని పట్టుబట్టి కూర్చుంది.కొరిక్, నూర్ లకు వాళ్ళ సంప్రదాయంలో పెళ్లి జరిగింది.అది జరిగిన తర్వాత వాళ్ళ ఆచారం ప్రకారం వధువును ఎత్తుకుని వెళ్ళాలి.అదే సమయంలో ప్రియురాలు ఎంట్రీ ఇవ్వడంతో అందరు షాక్ అయ్యారు.ఆమె పెళ్లి చేసుకోవాలని పట్టు బట్టడంతో ఒకే వేదికపై ఇద్దరినీ పెళ్లి చేసుకున్నాడు.

ఇద్దరిని అయితే పెళ్లి చేసుకున్నాడు కానీ వాళ్ళను పోషించే రాబడి మాత్రం లేదు.అతడు ఇద్దరి నుండి కట్నంగా 1.75 మిలియన్ రూపియ ( రూ 8,980 ) తీసుకున్నాడు.ప్రస్తుతం అతడు నిరుద్యోగి కావడంతో వాళ్ళను పోషించడం చాలా కష్టం.దీంతో నెటిజెన్స్ అతడిపై ఫైర్ అవుతున్నారు.

పోషించే శక్తి లేదు కానీ ఇద్దరినీ చేసుకున్నాడు అని కడిగి పారేస్తున్నారు.

#ShockedFiancs #Indonesia #Girlfriend #Indonesian #Girlfriend

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు