లెబనాన్ విధ్వంసం.. వధువు ఫోటో షూట్ వీడియో వైరల్!

లెబనాన్ రాజధాని బేరూత్‌లో భారీ పేలుడు ఎంత అల్లకల్లోలం సృష్టించింది అన్న సంగతి తెలిసిందే.ఈ పేలుడులో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందమంది ప్రాణాలు పోయాయి.

 Bride Runs, Horror Of Beirut Blast, Lebanon Blast, Viral Video, Wedding Photosho-TeluguStop.com

నాలుగు వేలమందికిపైగా ప్రజలు గాయాలపాలయ్యారు.బేరూత్ పోర్టులో జరిగినా ఈ ప్రమాదం కారణంగా చుట్టుపక్కల ఉన్న భవనాలు అన్ని కుప్పకూలిపోయాయి.

ఇంకా ఇది అంత తెలియని ఓ కొందరు వెడ్డింగ్ ఫోటో షూట్ లో పాల్గొన్నారు.పోర్టుకు సమీపంలోని ఓ స్టూడియోలో ఫోటో షూట్ లో పాల్గొన్న వధువు పులా బొకేతో పోజులు ఇస్తున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది.

మ్యూజిక్ హోరు కారణంగా వారికి బయట ఏం జరుగుతుందో తెలియలేదు.

ఆ పేలుడు ప్రభావానికి వధువు ఏం జరుగుతుందో తెలియక వరుడి చేయి పట్టుకొని పరిగెడుతున్న ఫోటో సోషల్ మీడియాలో కనిపించింది.

ఇంకా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.బేరూత్ పోర్టులోని గోదాములో గత ఆరేళ్లుగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని లెబనాన్ అధ్యక్షుడు మికెల్ ఒవాన్ ట్వీట్ చేశాడు.

ఇంకా దానికి సంబంధించిన ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube