బుల్లెట్‌ పై వచ్చిన పెళ్లి కూతురు... ప్రతి ఒక్క రైతు తలెత్తుకునేలా చేసిన ఈ అమ్మాయికి హ్యాట్సప్‌ చెప్పాల్సిందే  

Bride Rides Royal Enfield Bullet Into Marriage Hall-

అమ్మాయిలు ఈమద్య కాలంలో చాలా ఫాస్ట్‌ అయ్యారు అనేందుకు చాలా ఉదాహరణలు కనిపిస్తున్నాయి.అయితే పట్టణంకు చెందిన అమ్మాయిలు మాత్రమే అభివృద్దిలో దూసుకు పోతున్నారని, వారిలో మాత్రమే పాశ్చత్య పద్దతు కనిపిస్తున్నాయని మనం ఇంత కాలం భావించాం.

Bride Rides Royal Enfield Bullet Into Marriage Hall--Bride Rides Royal Enfield Bullet Into Marriage Hall-

కాని ఒక రైతు కుటుంబంలో పుట్టిన అమ్మాయి మాత్రం మేమేమైనా తక్కువనా, దేశానికి అన్నం పెట్టే రైతు కడుపులో పుట్టిన మేము ఎంతో ఉన్నతంగా, ఎంతో హుందాగా జీవితాన్ని గడుపుతున్నాం అంటూ నిరూపించేందుకు పెద్ద పనే చేసింది.అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఆమె పెళ్లి ని ఎంచుకుంది.

Bride Rides Royal Enfield Bullet Into Marriage Hall--Bride Rides Royal Enfield Bullet Into Marriage Hall-

తన పెళ్లి సందర్బంగా ఇంటి నుండి ఫంక్షన్‌ హాలు వరకు దాదాపు అయిదున్నర కిలోమీట్ల మేరకు బండిని నడుపుతూ వచ్చింది.మామూలుగా కాదు.పెళ్లి కూతురుగా ముస్తాబు అయిన తర్వాత బుల్లెట్‌ ఎక్కింది.ఎర్రటి పట్టు చీర, కాళ్లకు పారాణి, పూల జడ, చేతినిండా కాజులు, ముఖాన సిందూరం వంటివి ధరించి బుల్లెట్‌ పై ఆమె స్వారీ చేస్తుంటే దారి పొడువునా ఆమెను చూసిన వారు నోరెళ్లబెట్టారు.

చినప్పటి నుండే బండి నడపడం అభిరుచిగా ఉన్న ఈ యువతికి తండ్రి ప్రోత్సాహంతో బుల్లెట్‌ నడపడం వచ్చింది.సరదాగా అప్పుడప్పుడు బెల్లెట్‌ నడిపే ఈ అమ్మడు తాజాగా పెళ్లి కూతురు అయిన తర్వాత కూడా కారులో ఎక్కకుండా తన తండ్రి బుల్లెట్‌పై వచ్చింది.

పెళ్లి తర్వాత పెళ్లి కొడుకును కూడా బుల్లెట్‌ పై సదరు యువతి ఎక్కించుకు పోతే మరింత హైలైట్‌గా ఉండేది.కాని అలా జరగలేదు.పెళ్లి వేదిక వద్దకు బుల్లెట్‌ పై వస్తాను అంటే ఆ వరుడు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆమె ఈ పని చేసింది.బందువులు మాత్రం ఆమెను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.ఇలా చేయడం ఏంటీ అంటూ అవాక్కవుతున్నారు.పెళ్లి పిల్ల పద్దతిగా ఏ గుర్రపు బండి మీదనో, ఏనుగు అంబారిపైనో లేదంటే కారులోనో రావాలి కాని ఇలా బుల్లెట్‌ బండిపై రావడం ఏంటీ అంటూ పెదవి విరుస్తున్నారు.

ఆ యువతి మాత్రం తన తండ్రి గౌరవంను పెంచేందుకు ఇలా చేశానంటోంది.రైతు బిడ్డను అంటూ గర్వంగా చెప్పుకుంటాను అంటోంది.