కారు బానెట్‌పై కూర్చుని వధువు వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. చివరికి ఊహించని షాక్..

Bride Rides On Car Bonnet Gets Fined Rs 16500 By Cops In Prayagraj Details, Bride, Wedding Celebrations, Social Media, India, Traffic Laws, Fine, Bonnet Of Car, Viral Video, Prayagraj, Bride Varnika, Bride Rides On Car Bonnet

ఈ రోజుల్లో పెళ్లి వేడుకలలో వధూవరుల చేష్టలు శృతిమించుతున్నాయి.వారు చేస్తున్న పిచ్చి పనుల వల్ల చివరికి అధికారులను చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.

 Bride Rides On Car Bonnet Gets Fined Rs 16500 By Cops In Prayagraj Details, Brid-TeluguStop.com

ఇలాంటి ఘటనలకు పదేపదే పనులు రావడం అవుతున్న కొత్త వధూవరులు జాగ్రత్తలు తీసుకోకుండా చిక్కుల్లో పడుతున్నారు.తాజాగా ఒక వధువు ( Bride ) కూడా ఒక పిచ్చి పని చేసి చివరికి భారీ షాక్ తిన్నది.

వివరాల్లోకి వెళ్తే.భారతదేశంలోని ప్రయాగ్‌రాజ్‌లో,( Prayagraj ) వర్ణిక( Bride Varnika ) అనే వధువు తన పెళ్లి వేడుకల సందర్భంగా సోషల్ మీడియా కోసం కొన్ని మంచి మూమెంట్స్ వీడియో రికార్డ్ చేద్దామనుకుంది.

కొత్తగా చేస్తే తన వీడియోని ఎక్కువ మంది చూస్తారని భావించింది.అందుకే కదులుతున్న కారు బానెట్‌పై కూర్చొని సెలబ్రేషన్స్ చేసుకుంది.

అయితే ప్రమాదకరంగా కారుపై కూర్చున్నందుకు ఆమెకు పోలీసులు జరిమానా విధించారు.

ఆమె వీడియోను అప్‌లోడ్ చేసిన తర్వాత, అది తక్కువ సమయంలోనే వైరల్‌గా మారింది, ఇది స్థానిక పోలీసుల దృష్టిని ఆకర్షించింది.ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వర్ణికకు రెండు చలాన్లు జారీ చేశారు.వీడియోలో కదులుతున్న ఎస్‌యూవీ బానెట్‌పై ఆమె కూర్చున్నందున ఒక చలాన్ రూ.16,500 (భారతీయ రూపాయలు) కాగా,

గతంలో హెల్మెట్ ధరించకుండా స్కూటర్ నడుపుతూ కనిపించినందున మరో చలాన్ రూ.1,500 ఫైన్ విధించారు.ఈ వెడుక సివిల్ లైన్స్ ప్రాంతంలో జరిగింది.వీడియో ఆల్ సెయింట్స్ కేథడ్రల్ సమీపంలో మే 16న చిత్రీకరించబడింది.అంతకుముందు స్కూటర్ వీడియో కొన్ని నెలల క్రితం చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ సమీపంలో రికార్డ్ అయ్యింది.సబ్-ఇన్‌స్పెక్టర్ అమిత్ సింగ్ ఈ వివరాలను ప్రస్తావించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube