పెళ్లి ఆపేసిన వరుడు..వధువును సపోర్ట్ చేస్తున్న నెటిజెన్స్..ఏం జరిగిందంటే ?

పెళ్లి అనేది ఇద్దరి మనుషులను మాత్రమే కాదు రెండు కుటుంబాలను కూడా దగ్గర చేస్తుంది.పెళ్లిళ్లు కుదిరాక ఏదో కారణంగా చాలా పెళ్లిళ్లు ఆగిపోతూనే ఉంటాయి.

 Bride Refuses To Pay Ex After He Cancels Grand Wedding He Wanted, Groom Cancels-TeluguStop.com

పెళ్లి సమయంలో ఒకరి మీద ఒకరికి అభిప్రాయ బేధాలు ఆ పెళ్లిళ్లు జరగ కుండానే పెటాకులు అవుతుంటాయి.అయితే తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.

పెళ్ళిలో వచ్చిన మనస్పర్ధలు కారణంగా వరుడే ఈ పెళ్లిని ఆపేస్తున్నట్టు చెప్పాడు.

అయితే వరుడు పెళ్లి రద్దు చేసి అంతటితో ఆగకుండా పెళ్ళికి ఏర్పాట్లకు అయినా ఖర్చులను కూడా తిరిగి చెల్లించాలని ఒత్తిడి తీస్తున్నాడని వధువు వాపోతుంది.

ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా నెటిజెన్స్ తో పంచుకుంది.దీంతో నెటిజెన్స్ వధువునే సపోర్ట్ చేస్తున్నారు.అసలు ఏం జరిగింది.ఎందుకు వాళ్ళ మధ్య మనస్పర్థలు వచ్చాయా అని అనుకుంటున్నారా.

వధువు వరుడితో పెళ్లి తక్కువ ఖర్చుతో ఆడంబరాలు లేకుండా చేసుకుందాం.అని చెప్పిందట.అందుకే వరుడు ఒప్పుకోలేదు.పెళ్లి చాలా గ్రాండ్ గా జరగాలని చెప్పడంతో ఈ విషయంపై ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది.

చివరకు కొన్ని ఖర్చులను తగ్గించుకుంటానని వరుడు అనడంతో వధువు ఓకే చెప్పింది.అప్పటికే వరుడు పెళ్ళి ఏర్పాట్లకి భారీ ఖర్చులు పెట్టాడు.

అయితే ఇలా పెళ్లి సింపుల్ గా జరగాలని చెప్పడంతో వరుడు తల్లి, అత్తలు కూడా ఇందుకు ఒప్పుకోలేదు.సంప్రదాయంగా ఉండే అన్ని వేడుకలు జరగాలని వరుడు తల్లి చెప్పడంతో వరుడు కూడా వధువు పై ఒత్తిడి తేవడమీ కాకుండా వాటికీ ఒప్పుకోక పోతే పెళ్లి ఆపేస్తానని బెదిరించాడని అయినా కూడా నేను అంగీకరించలేదని ఆమె తెలిపింది.

దీంతో పెళ్లి రద్దు చేసాడని తెలిపింది.

Telugu Groom-Latest News - Telugu

ఆ తర్వాత కొద్దీ రోజులకు పెళ్లి ఖర్చుల కోసం అయినా డబ్బులో సగం ఇవ్వాలని వరుడు చెప్పడంతో ఈ విషయంలో నెటిజెన్స్ వధువుకే సపోర్ట్ చేస్తున్నారు.అతడే పెళ్లి ఆపేసాడని కాబట్టి పెళ్లి ఖర్చులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube