పీఠల మీద పెళ్లి ఆపిన పెళ్లి కూతురు... శభాష్‌ అన్న బంధు మిత్రులు, చదివిన తర్వాత మీరు కూడా అదే మాట అంటారు  

Bride Refuses To Marry Drunken Groom-

ఒకప్పుడు ఇండియన్‌ అమ్మాయిలు అమ్మానాన్న ఏది చెబితే అదే అన్నట్లుగా ఉండే వారు.వారికంటూ సొంత ఆలోచన ఉండేది కాదు.కాని ఇప్పుడు అమ్మాయిలు అలా కాదు, చదవు, పెళ్లి, జీవితం ఇలా అన్ని కూడా వారి ఇష్టానుసారంగానే సాగుతున్నాయి.

Bride Refuses To Marry Drunken Groom--Bride Refuses To Marry Drunken Groom-

తల్లి దండ్రులు కూడా వారి ఇష్టానుసారంగానే వారిని వెళ్లనివ్వాలని భావిస్తున్నారు.అందుకే పెళ్లి విషయంలో ఈమద్య అమ్మాయిలకు పూర్తి స్వేచ్చను ఇస్తున్నారు.అమ్మాయికి నచ్చితేనే పెళ్లి అంటూ ఎక్కువ శాతం తల్లిదండ్రులు భావిస్తున్నారు.జీవితాంతం కలిసి ఉండాల్సిన వ్యక్తిని అమ్మాయి పూర్తిగా నచ్చితేనే పెళ్లి చేస్తున్నారు.

Bride Refuses To Marry Drunken Groom--Bride Refuses To Marry Drunken Groom-

తాజాగా లక్నో శివారులోని శివరామ్‌ దంపతుల కూమార్తెకు అన్ని మాట్లాడుకుని పెళ్లి చేసేందుకు సిద్దం అయ్యారు.తన కుమార్తె ఓకే అన్న తర్వాతే శివరామ్‌ పెళ్లి ఏర్పాట్లు చేశాడు.పెళ్లి ఏర్పాట్లలో శివరామ్‌ బిజీ అయ్యాడు.తీరా పెళ్లి రోజు రానే వచ్చింది.ఆమె కూడా ఎంతో ఆసక్తిగా పెళ్లి కోసం ఎదురు చూసింది.కొత్త జీవితంలో అడుగు పెడుతున్నందుకు కాస్త భయంగా ఉన్నా కోటి ఆశలతో ముందడు వేయాలని భావించింది.

పెళ్లి ఘడియలు రానే వచ్చాయి.మరి కొన్ని గంటల్లో పెళ్లి, అయితే ఆ సమయంలోనే పెళ్లి క్యాన్సిల్‌ అంటూ పెళ్లి కూతురు తేల్చి చెప్పింది.ఆమె చెప్పిన రీజన్‌ రీజన్‌బుల్‌గా అనిపించడంతో కుటుంబ సభ్యులు మరియు బంధువులు అంతా కూడా ఆమెకు మద్దతు పలికారు.

ఇంతకు ఆమె పెళ్లిని ఎందుకు క్యాన్సల్‌ చేసిందటే.పెళ్లి రోజు కూడా అబ్బాయి తాగి వచ్చాడు.మామూలుగా అయితే తాగడం పర్వాలేదు, మరీ పెళ్లి రోజు, అది కూడా మరికొన్ని గంటల్లో పెళ్లి ఉండగా తాగడం అంటే మామూలు విషయం కాదు.అది కూడా మరీ తూలుతూ పడేలా తాగడంతో పెళ్లి కుమార్తెకు విరక్తి అనిపించింది.

పెళ్లి రోజే ఇంత తాగితే పెళ్లి అయిన తర్వాత నా పరిస్థితి ఏంటని ఆమె ఆలోచించింది.ఇలాంటి తాగు బోతు భర్తతో నేను వేగలేను అంటూ ముందే చెప్పేసింది.

అబ్బాయి తరపు బందువులు ఎంతగా ఒప్పించే ప్రయత్నం చేసినా కూడా శివరామ్‌ దంపతులు తమ కూతురు ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేయలేం అంటూ తేల్చి చెప్పారు.దాంతో పీఠలమీద పెళ్లి ఆగిపోయింది.ధైర్యంగా పెళ్లి వద్దని చెప్పిన అమ్మాయిని అంతా కూడా అభినందించారు.శివరామ్‌ ఆమెకు మరో పెళ్లి సంబంధం చూశాడట, త్వరలోనే పెళ్లి ఉంటుందని స్థానికులు చెప్పుకొచ్చారు.