వైరల్ వీడియో.. ఓవర్ చేసిన ఫోటోగ్రాఫర్ ను వధువు ఏం చేసిందంటే !

ఈ మధ్య ప్రతి వేడుకకు ముందు ప్రీ ఫోటో షూట్ కామన్ అయ్యింది.ఇంతకు ముందు కేవలం పెళ్ళికి మాత్రమే ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ చేసుకునే వారు.

 Bride Pushes Groom And Photographer Into The Water During Photoshoot-TeluguStop.com

కానీ ఇప్పుడు పెళ్లి దగ్గర నుండి బారసాల వరకు ప్రతి వేడుకకు ఫోటో షూట్ జరుపుకుంటూ వాళ్ళ ఆనందాలను ఫోటోలు రూపంలో జాగ్రత్తగా భద్ర పరుచు కుంటున్నారు.అయితే ఫోటోలు తీసే ఫోటో గ్రాఫర్స్ వల్ల కొన్ని కొన్ని సార్లు ఇబ్బందులు ఎదుర్కొంటు ఉంటారు.

ఆ ఫోటో గ్రాఫర్స్ కూడా ఓ పెద్ద సినిమా తీస్తున్న రేంజ్ లో ఊహించుకుంటూ ఎక్కువ చేస్తూ ఉంటారు.ఇంతకు ముందు చాలా వీడియోలు చూసే ఉంటాం.

 Bride Pushes Groom And Photographer Into The Water During Photoshoot-వైరల్ వీడియో.. ఓవర్ చేసిన ఫోటోగ్రాఫర్ ను వధువు ఏం చేసిందంటే -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పెళ్లి లో ఫోటో గ్రాఫర్ అతి చేసాడని పెళ్లి కొడుకు కొట్టిన వీడియోలు కూడా చాలానే వచ్చాయి.ఇలా ఫోటో గ్రాఫర్స్ వల్ల వధూవరులు చాలానే ఇబ్బందులు పడుతూ ఉంటారు.

వాళ్ళు చెప్పే ఫోజులు పెట్టలేక కష్టపడుతూ ఉంటారు.

తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది.

అందులో కూడా ఫోటో గ్రాఫర్ చేసిన నిర్వాకం కారణంగా వధువు బాగానే పనిష్ మెంట్ ఇచ్చింది.అయితే ఫోటో గ్రాఫర్ తో పాటు పెళ్లి కొడుకుకి కూడా ఈ పనిష్ మెంట్ ఇచ్చింది.

ఎందుకో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా.ఈ వీడియో చుస్తే మీకే అర్ధం అవుతుంది.

ఈ వీడియోలో నూతన వధూవరులు ఫోటో షూట్ జరుపుకుంటున్నారు.

అయితే ఫోటో గ్రాఫర్ వధూవరులకు ఏదో ఫోజో చూపించి అలా చేయమన్నాడు.వాళ్ళు చిన్న కొలను లాంటి ప్లేస్ లో మధ్యలో ఉన్న వేదికపై ఫోటోలు దిగుతున్నారు.అతడు చెప్పిన ఫోజు వేళ్ళు పెట్టలేక పోతున్నారని ఫోటో గ్రాఫర్ వచ్చి వరుడికి చూపిస్తున్నాడు.

అంతే వధువు వెంటనే వారిద్దరిని నీటి కొలనులోకి తోసేసింది.

దీంతో బాగా రెడీ అయి వచ్చిన వరుడు నీటిలో పూర్తిగా తడిసి పోయాడు.

ఈ వీడియో చుసిన నెటిజెన్స్ ఫోటో గ్రాఫర్ పై రకరకాల కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.మీరు కూడా ఓసారి లుక్కేయండి.

#PushesGroom #Naughty #Bridegroom

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు