వింత ఆచారం : అక్కడ పెళ్లికి ముందు పెళ్లి కూతురు ప్రతి రోజు ఏడవాల్సిందే..ఎందుకో తెలుసా?

వింత ఆచారాలు వింత సంస్కృతులు , ప్రపంచం లో కొన్ని లక్షల ఆచారాలు ఉన్నాయి.ఒక్కో ప్రాంతం వారు తమ తమ ఆచారాలను పాటిస్తూ వాటికి గౌరవం ఇస్తారు.

 Bride Needs To Cry Daily Before Marriage-TeluguStop.com

మన ఆచారాలు ఇతరులకు వింతగా అనిపించచ్చు , అలాగే వారి ఆచారాల గురించి విన్నప్పుడు కూడా మనకి అనిపిస్తుంది ఏంటి ఇలాంటి వింత ఆచారాలు ఉన్నాయా అని.అలా చైనా దేశం లో సిచుయన్ అనే ప్రాంతం లో ఒక తెగ జనాలు ఇప్పటికి ఒక వింత ఆచారం పాటిస్తారు.అదేంటో తెలుసా.పెళ్లి జరిగే ముందు పెళ్లి కూతురు నెల రోజుల పాటు ప్రతి రోజు ఏడవాల్సిందే… అసలు ఈ ఆచారం వెనుక కథేంటో తెలుసుకుందాం.

చైనా లోని సిచుయన్ అనే ప్రాంతం లో ఉండే తుజియా ప్రజలు ఒక వింత ఆచారాన్ని ఇప్పటికి పాటిస్తున్నారు.పెళ్లి చేసుకునే ఒక నేల ముందు నుండి పెళ్లయ్యే వరకు పెళ్లి కూతురు ఏడుస్తూ ఉండాల్సిందే.

అది ఆమెకి నచ్చిన నచ్చకపోయినా.ఈ ఆచారాన్ని 17 వ శతాబ్దం లో ఎక్కువ గా ఆ ప్రాంత ప్రజలు పాటించేవారు.

కానీ ఈ ఆచారం మొదలయింది మాత్రం క్రీ.పూ.475 – 221 కాలం లో అని అక్కడి రికార్డ్ లు తెలుపుతున్నాయి.ఈ ఆచారం వెనుక ఒక కథ ఉందంట అదేంటంటే.

జవో రాజ్యానికి చెందిన యువరాణి యన్ రాజ్యానికి చెందిన రాజు ని పెళ్లి చేసుకొని వెళ్ళేటప్పుడు ఆ యువరాణి తల్లి ఆమె వెళ్లిపోవడం చూసి కన్నీళ్లు పెట్టుకుందంట , ఆమెని ఇంటికి త్వరగా తిరిగి రావాలని కోరి అలా ఏడుస్తూనే ఉండేదట.ఇదే ఆ ప్రాంతం లో జరిగిన మొదటి ఏడుపు పెళ్లి అలా అప్పటి నుండి అక్కడ ఆచారాన్ని పాటిస్తున్నారు.

ముందుగా పెళ్లి కూతురు ఏడుస్తుంది మరికొన్ని రోజులకు ఆమె తల్లి ఇంకొన్ని రోజులకు వారి కుటుంబ సభ్యులు ఏడవడం ప్రారంభిస్తారు.ఇలా పెళ్లి అయ్యే రోజు వరకు ఏడుస్తూనే ఉంటారు.

ఒకవేళ పెళ్లి కూతురు ఏడవకుంటే ఆమె తల్లి లేదా కుటుంబ సభ్యులు ఆమె ని కొట్టి ఏడిపిస్తారట , ఆమె తో పాటు కొన్ని రోజులకు కుటుంబ సభ్యులు కూడా ఏడుస్తారు.ఈ ఆచారాన్ని అక్కడి ప్రజలు ‘ జువు టాంగ్ ‘ అని అంటారు.

ఈ ఆచారం అక్కడ ఉండే వివిధ తెగలలో వారికి నచ్చినట్లు జరుపుకుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube