కాసేపట్లో పెళ్లి...ఆపండి అన్న పెళ్ళికొడుకు..! ఎందుకో తెలుసా.? అసలేమైంది.?   Bride Groom Stopped Marriage Hours Before Wedding     2018-09-04   11:39:08  IST  Sainath G

కాసేపట్లో పెళ్లి…తాళికట్టబోతున్న వరుడు. సాధారణంగా ఇలాంటి సీన్ లో సినిమాలో అయితే “ఆపండి” అనే డైలాగ్ వినిపిస్తుంది. ఆ ఆపండి అనేది హీరో నో లేక హీరోయిన్ అయ్యుంటది. లవర్ కి వేరొకరితో పెళ్లి జరుగుతుంటే ఆపండి అంటారు సినిమా క్లైమాక్స్ లో. కానీ కృష్ణా జిల్లా పామర్రులో మాత్రం కొంచెం వింత ఘటన చోటు చేసుకుంది. కాసేపట్లో పెళ్లి అనగా పెళ్లి ఆపండి అనే డైలాగ్ వినిపించింది. కాకపోతే వింత ఏంటి అంటే..ఆపండి అనింది స్వయానా పెళ్లి కొడుకే. వివరాల లోకి వెళ్తే..

పామర్రు మండలం నిబానుపూడకు చెందిన యువకుడికి తోట్లవల్లూరు మండలం రొయ్యూరు యువతితో గత జూన్‌లో నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుండి ఇద్దరు ఫోన్ లో తెగ మాట్లాడుకునేవారు. కానీ, ఇటీవల ఆ అమ్మాయిపై యువకుడికి అనుమానం వచ్చింది. ఆదివారం (సెప్టెంబర్ 2) రాత్రి 10 గంటలకు వివాహ ముహూర్తం ఉండగా.. ఆమెను పెళ్లి చేసుకోనని వరుడు తెగేసి చెప్పడంతో బంధువులు షాక్ తిన్నారు. చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోవడంతో‌ వధువు కుటుంబ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేసారు.

అన్ని కుదిరింది అనుకోని పెళ్ళికి ఏర్పాట్లు చేసిన తర్వాత చివరి నిమిషంలో కాన్సుల్ చేయడంతో తమ కుమార్తెకు ఇది తీరని అవమానమని వధువు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వరుడితో పాటు 11 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.