40 మంది బౌన్సర్ల మధ్య తాళికట్టిన వరుడు,ఎక్కడంటే  

Bride Groom Arranges 40 Bouncers For His Marriage In Kottagudem - Telugu Bride Groom, , Singyathanda Marriage, Singyathanda Marriage Latest News, Takulapally Mandalam

ఈ తరంలో వెరైటీ పెళ్లిళ్లు చాలా కామన్ అయిపోయాయి.వారి పెళ్లి వెరైటీ గా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా వినూత్నంగా పెళ్లి చేసుకోవడానికి చూస్తున్నారు.

Bride Groom Arranges 40 Bouncers For His Marriage In Kottagudem

మరి భద్రాద్రి కొత్త గూడం జిల్లా లో కూడా ఒక వెరైటీ వివాహవేడుక జరిగింది.అయితే వెరైటీ కోసం వరుడు అలా చేశాడో లేదంటే మరేదైనా కారణం ఉందొ తెలియదు కానీ పెళ్లి కోసం 40 మంది బౌన్సర్ల ను ఏర్పాటు చేసుకొని మరి పెళ్లి చేసుకున్నాడు.

అయితే ఎదో మంచి ధనవంతుల కుటుంబం లో ఇలాంటి పెళ్లి జరిగితే సర్వ సాధారణం అని చెప్పాలి, కానీ వెరైటీ గా ఒక సాధారణ వ్యక్తే ఇలా 40 మంది బౌన్సర్ల ను పెట్టుకొని పెళ్లి లో నానా హంగామా సృష్టించాడు.

పెళ్లి వేడుకకు వచ్చిన అతిధులు అందరూ కూడా వరుడు చేసిన హంగామా చూసి ముక్కున వేలువేసుకున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని టేకుల పల్లి మండలం సింగ్యతండాకు చెందిన బానోతు పూల్సింగ్ కుమారుడు రవితేజ.అయితే అతడికి ములుగు జిల్లాకు చెందిన అమ్మాయి తో వివాహం నిశ్చయమైంది.

అయితే తన వివాహం కోసం 40 మంది బౌన్సర్లను నియమించుకున్నాడు.అయితే వారంతా కూడా సఫారీలు ధరించి నల్ల కళ్లజోళ్ల తో మండపం లో అక్కడక్కడ దర్శనమిచ్చారు.

పెళ్లికి వచ్చిన వారంతా అక్కడ ఏం జరుగుతుందో తెలియక వింతగా చూస్తుండిపోయారు.ఓ సాధారణ వ్యక్తి 40 మంది బౌన్సర్లను నియమించుకోవడం ఏంటని ఆశ్చర్యపోయారు.

సెలబ్రిటీలకు సైతం ఈ స్థాయిలో భద్రత ఉండదంటూ విడ్డూరం వ్యక్తం చేశారు.అదే పెళ్లి లో మరో విశేషం ఏమిటంటే, వరుడు తన పెళ్లి కోసం వాడిన పూలను ప్రత్యేకంగా రాజమండ్రి నుంచి తెప్పించుకున్నాడట.

దీనితో మొత్తానికి ఒక సామాన్యుడి వివాహం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bride Groom Arranges 40 Bouncers For His Marriage In Kottagudem Related Telugu News,Photos/Pics,Images..

footer-test