ఇదెక్కడి మోసం మావా : ఫస్ట్ నైట్ రోజున డాబా మీదకి వెళ్లిన భార్య... చివరికి అటునుంచి అటే....

ప్రస్తుత కాలంలో కొందరు డబ్బు మీద ఉన్నటువంటి వ్యామోహంతో ప్రేమ పెళ్లి, ప్రేమ బంధాలను వాడుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.కాగా తాజాగా ఓ యువతి డబ్బులు సంపాదించడం కోసం నిత్య పెళ్లి కూతురుగా మారి యువకులతో అందినంత దోచుకుని పరార్ అవుతున్న ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

 Bride Escape In First Night Day-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలో “అనిత రత్నాకర్” అనే యువతి తన కుటుంబ సభ్యులతో నివాసముంటోంది.అయితే ఈ మధ్యకాలంలో అనిత రత్నాకర్ డబ్బు మీద వ్యామోహంతో నిత్య పెళ్లి కూతురుగా మారింది.

ఈ క్రమంలో లో 30 ఏళ్లు దాటినా పెళ్లి కాని యువకులు, అలాగే దోషాలు, లోపాలు వంటి వాటి కారణంగా పెళ్లి కాని వ్యక్తులను టార్గెట్ చేసి పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేస్తోంది.దీనికితోడు అనితా కుటుంబ సభ్యులు కూడా ఆమెకు సహకరించడంతో వీరి ఆగడాలకు హద్దు లేకుండా పోతోంది.

 Bride Escape In First Night Day-ఇదెక్కడి మోసం మావా : ఫస్ట్ నైట్ రోజున డాబా మీదకి వెళ్లిన భార్య… చివరికి అటునుంచి అటే….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా తాజాగా బింద్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ యువకుడికి 35 సంవత్సరాలు దాటినా పెళ్లి కాకపోవడంతో కొంతమేర దిగులుగా ఉండేవాడు.దీంతో తాజాగా అనిత తండ్రి ఆ యువకుడితో పరిచయం పెంచుకొని తాను అడిగినంత డబ్బు ఇస్తే అనిత తో పెళ్లి చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు.

దీంతో యువకుడు ఏమి ఆలోచించకుండా దాదాపుగా లక్ష రూపాయలు అనిత తండ్రికి ముట్టజెప్పాడు.దీంతో తూతూమంత్రంగా పెళ్లి జరిపించారు.ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.

కానీ పెళ్లయిన తర్వాత శోభనం రోజున అనిత తన భర్తని మభ్యపెట్టి ఉక్క పోతగా ఉందని కాబట్టి చల్ల గాలి కోసం కొంత సేపు డాబా మీదకు వెళ్తానని చెప్పి అటు నుంచి అటే జంప్ అయ్యింది.

అంతేకాక పెళ్లి కూతురు తరఫున వచ్చిన బంధువులు కూడా మూటా ముల్లె సర్దుకుని పరారయ్యారు.దీంతో పెళ్ళికొడుకు లబోదిబోమంటూ దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి తన గోడు వెళ్లబోసుకున్నాడు.

అంతేకాకుండా లేక లేక ఆయన పెళ్లి ఎలాగో పెటాకులైంది.కనీసం తాను ఖర్చు పెట్టిన డబ్బు అయినా తిరిగి ఇప్పించమని పోలీసులను కోరాడు.

#Bride Escape #Money Cheating #First Night Day #Madhya Pradesh #BrideEscape

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు