ప్రియుడితో పారిపోయిన వధువు.. ఆమె చెల్లి నిచ్చి పెళ్లి చేసిన తండ్రి.. కానీ..

ఈ మధ్యనే పెళ్ళికి కొద్దీ సేపు ముందు పెళ్లి కొడుకు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిన ఘటన జరిగింది.అది మరవక ముందే తాజాగా పెళ్లి మండపంలో మరొక వింత ఘటన జరిగింది.

 Bride Elopes With Boyfriend Groom Marries Minor Sister, Odisha, Groom, Minor Gir-TeluguStop.com

పెళ్లి మండపం సిద్ధంగా ఉంది.మరికాసేపట్లో పెళ్లి ముహూర్తం కూడా రాబోతుంది.

కానీ సరిగ్గా కొన్ని గంటలు ముందు పెళ్లి కూతురు కనపడడం లేదనే వార్త పెళ్లిమండపం అంత వ్యాపించింది.పెళ్ళికి ఇంకొన్ని గంటలు ఉందనగా పెళ్లి కూతురు ప్రియుడితో పారిపోయింది.

ఈ వార్త తెలుసుకున్న పెళ్లి కొడుకు బంధువులంతా పెళ్లి కూతురు బంధువులతో వాదనకు దిగారు.ఈ పెళ్లి మండపంలో మా కొడుకు పెళ్లి జరగకుండా మేము ఇంటికి వెళ్తే ఊరిలో మా పరువుపోతుంది అని పెళ్లి కూతురు బంధువులతో గొడవకు దిగారు.

ఆ సమయంలో చేసేదేమిలేక పెళ్లి కూతురు తండ్రి ఆమె చెల్లినిచ్చి పెళ్లి జరిపించాడు.కానీ అక్కడే అసలు ట్విట్స్ మొదలయ్యింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ఒడిస్సా రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కలహండి జిల్లా భవానిపాట్నాలో రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది.మంగళవారం పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి కూతురు పెళ్ళికి ఇంకొన్ని గంటలు ఉందనగా ప్రియుడుతో వెళ్ళిపోయింది.

ఈ విషయం పెళ్లి కొడుకుకి కూడా తెలిసిపోయింది.దీంతో పెళ్లి కొడుకు బంధువులంతా పెళ్లి కూతురు తరపు వారితో వాదనకు దిగారు.

పెళ్లి కూతురు తండ్రి చేసేదేమి లేక చిన్న కూతురుని పెళ్ళికి ఒప్పించాడు.ఎలాగోల ఆ ముహూర్తానికి పెళ్లి కూతురు చెల్లితో పెళ్లి చేసేసాడు.అయితే ఆ తర్వాత మరో షాకింగ్ న్యూస్ జరిగింది.పెళ్లి జరిగిన రెండు రోజుల తర్వాత పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి పోలీసులు వచ్చారు.

పోలీసులను చూసి వారంతా షాక్ అయ్యారు.పోలీసులు నవ వధువును వాళ్ళ సంరక్షణలోకి తీసుకున్నారు.

ఎందుకంటే.ఆ వధువు ఇంకా మైనర్ బాలికనే.ఆ బాలిక అన్నయ్యకు ఈ పెళ్లి ఇష్టం లేదు.15 సంవత్సరాలకే పెళ్లేంటంటూ తండ్రితో వాదన పెట్టుకుని ఆయన వినలేదని పోలీసులకు ఫిర్యాదు చేసాడు.పోలీసులు వెంటనే వరుడి ఇంటికి వెళ్లి ఆమెను వాళ్ళ అన్నయ్యకు అప్పగించారు.

అంతేకాదు రెండు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఆ వధువు తండ్రికి ఆమెకు 18 సంవత్సరాలు వచ్చే వరకు భర్త దగ్గరకు పంపించకూడదని సీరియస్ గా చెప్పారు.అంతేకాదు ఆ వరుడికి కూడా ఆ యువతీ మేజర్ అయ్యేంతవరకు ఆ ఇంటికి ఈ ఇంటికి రాకపోకలు ఉండకూడదని హెచ్చరించారు.

తండ్రి మాత్రం పెళ్లి కొడుకు వారు చిన్న కూతురుని ఇచ్చి పెళ్లి చేయాలనీ ఒత్తిడి చేయడం వల్లే తాను ఈ పెళ్ళికి ఒప్పుకున్నానని పోలీసులకు తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube