కర్ణాటకలోని ఓ పెండ్లి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.ఆనందంగా అత్తారింటికి చేరవలసిన పెళ్లి కూతురూ శ్మశానానికి చేరింది.
వైవాహిక జీవితంలోని ఆనందాలను ఆస్వాధించక ముందే యమపాశానికి బలి అయ్యింది.ఆ వివరాలు చూస్తే.
కర్ణాటకలోని అడ్యార్ పట్టణంలోని మసీదులో లైలా అఫియా అనే యువతికి, ముబారక్ అనే యువకుడికి, ఫిబ్రవరి 28న, అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.అదేరోజు రాత్రంతా వధూవరులతో కలిసి ఇరుకుటుంబాల సభ్యులు ఆటపాటలతో ఎంజాయ్ చేశారు.
ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత సందడిలో మునిగి ఉన్నపెళ్లి కూతురు లైలా ఛాతిలో నొప్పిగా ఉందంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ఊహించని పరిణామానికి భయస్తులైన వీరి కుటుంబ సభ్యులు వెంటనే దగ్గరిలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆ యువతి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
కాగా గుండెపోటు కారణంగానే లైలా మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైందట.చూశారా ఎంత దారుణం.
పెండ్లి జరిగిన కొన్ని గంటల్లోనే వధువు మరణించడం.దురదృష్టం అంటే ఇదే కాబోలు.