సాయం పేరుతో స్నేహితుడికి కాబోయే భార్య పైనే...  

Bride Complaint Against His Husband Friends In Up - Telugu Bride, Bride Latest News, Bride News, Uttar Pradesh, Uttar Pradesh Crime News, Uttar Pradesh Latest News, Uttar Pradesh Local News, Uttar Pradesh News

ప్రస్తుత కాలంలో కొందరు చేసేటటువంటి పనులు చూస్తుంటే ఆడపిల్లలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అసలు అర్థం కావడం లేదు.తాజాగా ఓ వ్యక్తి తనకి కాబోయే భార్యకి తోడుగా ఉండేందుకు తన స్నేహితులను పంపగా వారే ఆమెపై అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Bride Complaint Against His Husband Friends In Up

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందినటువంటి ఆర్నియా ప్రాంతంలో ఓ యువతి నివాసం ఉంటోంది.అయితే ఈమెకి ఇటీవల కాలంలో ఇదే ప్రాంతానికి చెందిన  మరో యువకుడితో వివాహం నిశ్చయమయింది.

అయితే వ్యక్తిగత పని నిమిత్తమై యువతి ఘజియాబాద్ వెళ్లడానికి రైలులో ఎక్కింది.అయితే రైలులో  సీటు విషయం నిమిత్తమై కొందరి వ్యక్తులు ఆమెతో గొడవ పడ్డారు.దీంతో ఈ విషయాన్ని తనకు కాబోయే భర్త కి తెలిపింది.దాంతో అతడు ఆమెకు తోడుగా ఉండేందుకు దగ్గరలో ఉన్నటువంటి తన స్నేహితులను రైల్వే స్టేషన్ కి పంపించాడు.

దీంతో వారు రు ఆమెను సురక్షిత ప్రాంతంగా తీసుకెళ్తామని నమ్మించి తమ మోటార్ వాహనం పై తీసుకెళ్లారు.అలాగే వెళుతూ జన సంచారం లేని ప్రాంతంలో ఆపి ఆమెపై దారుణంగా అత్యాచారం చేశారు.దీంతో యువతి అపస్మారక స్థితిలోకి చేరుకుంది.దీంతో ఆమె చనిపోయింది అనుకొని భయపడి నిందితులు ఆమెను అక్కడే వదిలి పెట్టి పరారయ్యారు.అయితే కొంత సమయం తర్వాత స్పృహలోకి వచ్చినటువంటి యువతి వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తనపై జరిగినటువంటి అఘాయిత్యం గురించి ఫిర్యాదు చేసింది.దీంతో బాధితురాలు తెలిపినటువంటి వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు.

తాజా వార్తలు