పిల్లతో పాటు తల్లి కూడా నచ్చడంతో..  చివరికి..  

ప్రస్తుత కాలంలో కొందరు కామంతో కొట్టుమిట్టాడుతూ తీసుకున్న నిర్ణయాల కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.కాగా తాజాగా ఓ యువకుడు యువతిని పెళ్లి చూపులు చూసేందుకు వెళ్లి యువతితో పాటు తన పిన్ని కూడా నచ్చడంతో ఏకంగా ఎదురు కట్నమిచ్చి పెళ్లి చేసుకోవడానికి సిద్ధ పడ్డాడు కానీ చివర్లో వాళ్ళు ఇచ్చిన ట్విస్ట్ కి మోసపోయానని గ్రహించి పోలీసులను సంప్రదించిన ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ పట్టణ పరిసర ప్రాంతంలో వెలుగుచూసింది.

 Bride Cheats To The Groom For Money In Uttar Pradesh-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక మీరట్ పట్టణ పరిసర ప్రాంతంలో దేవేంద్ర అనే ఓ యువకుడు తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.అయితే ఇటీవలే దేవేంద్ర కి పెళ్లి వయసు రావడంతో తన కుటుంబ సభ్యులు పెళ్లి చేసే యోచనలో పడ్డారు.

ఈ క్రమంలో తెలిసిన వారి ద్వారా పెళ్లిచూపులు కూడా చూస్తున్నారు.అయితే తాజాగా దేవేంద్ర తెలిసిన ద్వారా రాణి (పేరు మార్చాం) అనే యువతిని పెళ్లిచూపులు చూడడానికి వెళ్ళాడు.

 Bride Cheats To The Groom For Money In Uttar Pradesh-పిల్లతో పాటు తల్లి కూడా నచ్చడంతో..  చివరికి..  -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో దేవేంద్రకి రాణి తో పాటు తన పిన్ని కూడా బాగా నచ్చింది.దీంతో రాణి తల్లిదండ్రులకు ఎదురు కట్నమిచ్చి మరీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు.

ఈ క్రమంలో అడ్వాన్స్ గా పెళ్లికూతురు తల్లిదండ్రులకి లక్ష రూపాయలు కూడా ముందే ఇచ్చాడు.

దీంతో సరిగ్గా పెళ్లి జరిగే సమయంలో వధువు వాష్ రూమ్ కి వెళ్లి వస్తానని వెళ్లి దాదాపుగా 20 నిమిషాల పాటు వధువు పెళ్లి మంఠపానికి రాలేదు.

దీంతో రాణి పిన్ని ఏం జరిగిందో చూడడానికి వెళ్ళింది.అయితే ఆమె కూడా ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో చివరికి దేవేంద్ర వెళ్లి చూశాడు.

ఇంకేముంది తాను మోసపోయినట్లు గ్రహించి వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తనకు న్యాయం చేయాలంటూ మొర పెట్టుకున్నాడు.దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

ఈ విషయంపై స్పందించిన కొందరు నెటిజన్లు పెళ్లి చేసుకోవాలంటే కుటుంబ సభ్యులు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసుకోవాలని చెబుతూ ఉంటారని ఇకనైనా జాగ్రత్తగా ఉండాలంటూ దేవేంద్రుడికి సూచిస్తున్నారు.

కరోనా గమనిక : బయటికి వెళ్లే సమయంలో మాస్కు తప్పకుండా ధరించండి.అలాగే నిత్యం చేతులను శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోండి.మీతో పాటూ మీ కుటుంభ సభ్యులను  కూడా సురక్షితంగా ఉంచండి.–  తెలుగుస్టాప్.కామ్ యాజమాన్యం

.

#Bride Cheating #BrideCheats #BrideCheating #Utter Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు